Telangana Election Results 2023 : కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజ - 2 చోట్లా ఈటలకు ఎదురుగాలి
Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇక అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజలో ఉన్నారు.
Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. సింగిల్ గానే అధికారంలోకి రానుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన… కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజలో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… ముందంజలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి రెండో స్థానంలో ఉండగా… కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.
మరోవైపు గజ్వేల్ లో కేసీఆర్ లీడ్ లో ఉండగా… బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. ఇక హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి లీడ్ లో ఉండగా… ఇక్కడ కూడా ఈటల వెనకబడ్డారు.
పాలకుర్తిలో మంత్రి దయాకర్ రావు బరిలో ఉండగా.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వని రెడ్డి ఆరో రౌండ్ ముగిసే సరికి 6900 పైచీలుకు ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు. వరంగల్ వెస్ట్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందద్ రెడ్డి మధ్య పోరు నడుస్తుండగా.. 2800 కు పైగా ఓట్లతో నాయిని లీడ్ లో ఉన్నారు. ఇక గత రెండు సార్లు భారీ మెజారిటీ సాధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పై కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు ముందంజలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ ముగిసే సరికి నాగరాజు 4821 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. మహబూబాబాద్ లో శంకర్ నాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్ 13,728 ఓట్లతో, పరకాల చల్లా ధర్మారెడ్డి పై ఐదో రౌండ్ లో కాంగ్రేస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి 2235 ఓట్ల ఆధిక్యం లో ఉన్నారు. నర్సంపేట 11 రౌండ్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి 5,054 ఓట్లతో ముందంజలో ఉన్నారు. భూపాలపల్లి లో బీఆరెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు 10 వేల పైచీలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ 6,271 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 14,716 ఓట్లు, డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్ర నాయక్ ఐదో రౌండ్ ముగిసే సరికి 13,186 ఓట్ల ఆధిక్యం లో ఉన్నారు.