Telangana Election Results 2023 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టి షాాక్ తగిలింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాగా… స్వయంగా కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలోనూ ఓడిపోయారు. ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి 6 వేలకు పైగా మెజార్టీ తో సంచలన విజయం సాధించారు.టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి … మూడో స్థానంలో నిలిచారు.
ఉదయం కౌంటింగ్ సమయంలో తొలి 8 రౌండ్లు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 2 వేల ఓట్ల వరకు లీడింగ్‌లో ఉండగా.. 9వ రౌండ్ నుంచి ఫలితాలు తారుమరయ్యాయి. ప్రతిరౌండ్‌లోనూ రమణారెడ్డి ఆధిక్యత సాధిస్తూ చివరకు ప్రజా ఆశీర్వాదంతో ముందు వరుసలో కొనసాగుతున్నారు. 19వ రౌండు పూర్తయ్యేసరికి రమణారెడ్డి 5810 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థికి మొత్తం 65,198 ఓట్లు రాగా..కేసీఆర్‌కు 59,388 ఓట్లు వచ్చాయి. ఇక రేవంత్‌రెడ్డికి 54,296 ఓట్లు పోలయ్యాయి.