Gangula Kamalakar : భార్య పుస్తెలమ్మి పోటీ చేసిన బండి సంజయ్ కు ఇన్ని కోట్లు ఎక్కడివి- గంగుల కమలాకర్-karimnagar news in telugu brs gangula kamalakar alleges bjp bandi sanjay corrupt leader ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Karimnagar News In Telugu Brs Gangula Kamalakar Alleges Bjp Bandi Sanjay Corrupt Leader

Gangula Kamalakar : భార్య పుస్తెలమ్మి పోటీ చేసిన బండి సంజయ్ కు ఇన్ని కోట్లు ఎక్కడివి- గంగుల కమలాకర్

HT Telugu Desk HT Telugu
Nov 26, 2023 04:05 PM IST

Gangula Kamalakar : మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మాయం అయ్యే వ్యక్తి బండి సంజయ్ అని గంగుల కమలాకర్ విమర్శించారు. అవినీతిపరుడు కాకుంటే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు.

గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం
గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం

Gangula Kamalakar : గత ఎన్నికల్లో తన భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పుకున్న బండి సంజయ్ కు నేడు కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. అవినీతిపరుడు కాకుంటే ఆయనను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. కరీంనగర్ రూరల్ మండలం ధుర్షేడు, ఇరుకుళ్ళ గ్రామాలలో గంగుల ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో గంగులకు ఘన స్వాగతం పలుకగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.

ట్రెండింగ్ వార్తలు

కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ...అధ్యక్ష పదవి ఇస్తే కోట్ల రూపాయలు వసూళ్లు చేసి నేడు ఓటుకు ఇరవై వేలు ఇచ్చి గెలిచేందుకు చూస్తున్నారని బండి సంజయ్ పై విమర్శలు చేశారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మాయం అయ్యే వ్యక్తి బండి సంజయ్ అన్నారు. ఎంపీగా గెలిచి నాలుగున్నరేళ్లు నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఓడించేందుకు దొంగలంత ఏకమయ్యారన్నారు.

కేసీఆర్ ను ఒడిస్తే మళ్లీ తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద దొంగ అని ఆయనకు ఓటేస్తే మీ భూములు మాయం చేస్తారన్నారని విమర్శించారు. ఆంధ్రా నాయకులు బీజేపీ కాంగ్రెస్ రూపంలో ఒక్కటయ్యారని వాళ్లని నమ్మి ఓటు వేస్తే తెలంగాణలో మళ్లీ కరెంటు కోతలు ఉంటాయని కటిక చీకటిలో మగ్గాల్సి వస్తుందన్నారు. ఓటు పవిత్రమైనదని ఒక్క ఓటు తప్పు జరిగితే యాభై ఏళ్ల దరిద్రం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి కేసీఆర్ చేతులను బలోపేతం చేసి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు.

రిపోర్టర్: గోపికృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా

WhatsApp channel