Miryalaguda IT Rides: మిర్యాలగూడలో ఐటీ సోదాలు
Miryalaguda IT Rides: తెలంగాణలో ఎన్నికల వేళ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నిన్నటి వరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగితే తాజాగా మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్థి నివాసంలో ఐటీ సోదాలంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే వాటిని బిఆర్‌ఎస్ అభ్యర్థి భాస్కరరావు ఖండించారు.
Miryalaguda IT Rides: అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు తాజాగా మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు బాస్కర్ రావు నివాసంలో తెల్లవారు జాము నుంచి సోదాలు జరుపుతున్నారు.
గురువారం ఉదయం 4 గంటల నుండి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ లో భాస్కరరావుకు సంబంధించిన ఇండ్లు, ఆఫీసులు, కంపెనీ కార్యాలయాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కరరావు మిత్రులు, సన్నిహతులు, వ్యాపారుల ఇళ్లలో ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం నల్లమోతు భాస్కర్ రావు భారీగా నగదు సమీకరించినట్లు సమాచారం అదండతో అందడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నల్లమోతు బాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా పవర్ ప్లాంట్స్‌తో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
భాస్కరరావుతో పాటు ఆయన అనుచరుల ఇండ్లు, ఆఫీసులలో కూడ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.మిర్యాలగూడ లోని బాస్కర్ రావుకు చెందిన వైదేహి వెంచర్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బాస్కర్ రావు ముఖ్య అనుచరుడు శ్రీధర్‌తో పాటు కుమారుల ఇళ్ళలో అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఎమ్మెల్యే అనుచరులు వైదేహి కనస్ట్రక్షన్స్ పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాస్కర్ రావుకు పలు మార్గాల ద్వారా భారీ మొత్తంలో నిధులు సమకూరినట్లు ఐటీ అధికారులకు పక్క సమాచారం అందడంతో వారు ఆకస్మిక సోదాలు జరుపుతున్నారు.
నల్లమోతు భాస్కర్ రావు మాజీ మంత్రి జనారెడ్డికి సన్నిహితుడు.1983 నుంచి జానారెడ్డి ఎన్నికల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. బి. ఎన్ రెడ్డి,ఎస్. జైపాల్ రెడ్డి, జి. సురేందర్ రెడ్డి విజయాల వెనుక భాస్కర్ రావు హస్తం ఉంది.
2005 నుండి మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించడంలో భాస్కర్ రావు కీలక పాత్ర పోషించారు. 2014 లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడ నియోజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2018 లో అదే మిర్యాలగూడ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా…
ఐటీ దాడులతో తనకు సంబంధం లేదని మిర్యాలగూడ అభ్యర్ధి భాస్కరరావు ప్రకటించారు. ఐటీ సోదాలు జరిగితే తాను ప్రచారంలో ఎలా పాల్గొంటానని ప్రశ్నించారు. తనకు ఎలాంటి పవర్ ప్లాంట్స్ లేవని నిరూపిస్తే వారికే రాసిచ్చేస్తానని చెప్పారు.మిర్యాలగూడలో ఉన్న వ్యాపారులు అంతా తనకు సన్నిహితులే అని, ఎవరిపై దాడి జరిగినా తనకు అపాదించడం సరికాదన్నారు.
(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)