TS DGP Suspended : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు-hyderabad news in telugu ec suspended dgp anjani kumar violation to election code ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Dgp Suspended : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు

TS DGP Suspended : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు

TS DGP Suspended : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను కేంద్రం ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకుంది.

డీజీపీపై వేటు

TS DGP Suspended : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ డీజీపీపై వేటు వేసింది. డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీస్ అధికారులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుని డీజీపీపై వేటు వేసింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్ కు నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి, స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన డీజీపీ పూలగుత్తితో అభినందించడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించడమే అని ఈసీ అభిప్రాయపడింది. అందుకే డీజీపీని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తదుపరి సీనియర్‌గా అర్హత ఉన్న పోలీసు అధికారికి వెంటనే తెలంగాణ డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది.

రేవంత్ రెడ్డిని కలిసి అధికారులు

ఎన్నికల మోడల్ కోడ్, సంబంధిత ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల సంఘం తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి సంజయ్ జైన్, మరో అధికారి మహేశ్ భగవత్‌తో కలిసి శాసనసభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలు తీసుకుంది.