Telangana DGP : తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా నియామకం-hyderabad news in telugu ec appointed ravi gupta as new dgp to telangana ,elections న్యూస్
Telugu News  /  Elections  /  Hyderabad News In Telugu Ec Appointed Ravi Gupta As New Dgp To Telangana

Telangana DGP : తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా నియామకం

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2023 08:27 PM IST

Telangana DGP : తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రవిగుప్తా
రవిగుప్తా

Telangana DGP : తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను కేంద్రం ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీ కుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలో కొత్త డీజీపీ ఎంపిక చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను సీఎస్ శాంతి కుమారి ఈసీకి సిఫార్సు చేశారు. ఇందులో రవిగుప్తాను కొత్త డీజీపీగా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, రవిగుప్తా డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

డీజీపీ అంజనీ కుమార్ పై వేటు

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ డీజీపీపై వేటు వేసింది. డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీస్ అధికారులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుని డీజీపీపై వేటు వేసింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్ కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి, స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన డీజీపీ పూలగుత్తితో అభినందించడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించడమే అని ఈసీ అభిప్రాయపడింది. అందుకే డీజీపీని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తదుపరి సీనియర్‌గా అర్హత ఉన్న పోలీసు అధికారికి వెంటనే తెలంగాణ డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది.

రేవంత్ రెడ్డిని కలిసిన అధికారులు

ఎన్నికల మోడల్ కోడ్, సంబంధిత ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల సంఘం తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి సంజయ్ జైన్, మరో అధికారి మహేశ్ భగవత్‌తో కలిసి శాసనసభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలు తీసుకుంది.

WhatsApp channel