KCR : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా, గవర్నర్ ఆమోదం-hyderabad news in telugu brs lost elections kcr resigned to cm post ,elections న్యూస్
Telugu News  /  Elections  /  Hyderabad News In Telugu Brs Lost Elections Kcr Resigned To Cm Post

KCR : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా, గవర్నర్ ఆమోదం

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2023 06:54 PM IST

KCR : కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖ పంపించారు. కేసీఆర్ గజ్వేల్ లో విజయం సాధించగా, కామారెడ్డి ఓటమి చెందారు.

కేసీఆర్
కేసీఆర్

KCR :ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం తన రాజీనామా లేఖను కేసీఆర్ రాజ్ భవన్ కు పంపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రెండు సార్లు సీఎం

తెలంగాణ రాష్ట్ర సాధించిన ఉద్యమనేత కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తిరుగులేని స్థాయిలో కేసీఆర్ రాజకీయం చేశారు. 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణకు మొదటి సీఎంగా కేసీఆర్ రికార్డులకెక్కారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఏకంగా 88 స్థానాల్లో విజయం సాధించారు. వరుసగా రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకూ దాదాపు తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ సీఎంగా సేవలు అందించారు.

గజ్వేల్ లో విజయం, కామారెడ్డిలో ఓటమి

గజ్వేల్ లో పోటీ చేసిన కేసీఆర్ విజయం సాధించగా, కామారెడ్డిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పాలైయ్యారు. గజ్వేల్ లో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45,174 ఓట్ల తేడాతో కేసీఆర్ గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తూమ్‌కుంట నర్సారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో సంచలన విజయం సాధించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలవగా, కేసీఆర్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

రాష్ట్రంలోనే వీవీఐపీ నేతలు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక్కడి ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి దిగ్గజాలను ఢీకొట్టిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కామారెడ్డి కింగ్‌ అయ్యారు.

WhatsApp channel