Telangana Election Results 2023 : పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమి - అదే బాటలో పలువురు మంత్రులు!-errabelli dayakar rao lost in palakurthi constituency over telangana elections 2023 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Election Results 2023 : పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమి - అదే బాటలో పలువురు మంత్రులు!

Telangana Election Results 2023 : పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమి - అదే బాటలో పలువురు మంత్రులు!

Telangana Election Results 2023 : పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఓటమిపాలయ్యాడు. మరికొన్నిచోట్ల మంత్రులు ఎదురీదుతున్నారు.

ఎర్రబెల్లి ఓటమి

Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. పాలకుర్తి నుంచి మరోసారి పోటీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. మరికొందరు మంత్రులు కూడా ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. 23, 582పైగా ఓట్లతో విజయం సాధించారు.

బాల్కొండలో ప్రశాంత్‌ రెడ్డి 3 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు.

పాలకుర్తిలో.. ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఓడిపోయారు.

ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్‌ ఓటమి.

సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి… ఆధిక్యంలో ఉన్నారు.

నిర్మల్‌ నియోజకవర్గంలో ఇంద్రకరణ్‌ రెడ్డి ఓటమి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌ వెనకబడి ఉన్నారు.

మహబూబ్‌నగర్‌ లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఓటమి పొందారు.

సనత్ నగర్ లో మంత్రి తలసాని విజయం.

మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు.

ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఓటమి.