Telangana Elections 2023 : తెలంగాణలో 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు ఈసీ అనుమతి - అత్యధికంగా సిద్ధిపేటలోనే-ec allowed 28057 postal ballot applications in telangana elections 2023 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Elections 2023 : తెలంగాణలో 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు ఈసీ అనుమతి - అత్యధికంగా సిద్ధిపేటలోనే

Telangana Elections 2023 : తెలంగాణలో 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు ఈసీ అనుమతి - అత్యధికంగా సిద్ధిపేటలోనే

HT Telugu Desk HT Telugu
Nov 17, 2023 11:58 AM IST

Postal Ballot Votes in Telangana 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అనుమతి ఇచ్చింది ఎన్నికల సంఘం. అత్యధికంగా సిద్ధిపేట నియోజకవర్గంలో పోస్టల్ ఓట్లు ఉన్నాయి.

తెలంగాణలో 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు అనుమతి
తెలంగాణలో 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు అనుమతి

Telangana Assembly Elections 2023: నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను ఎన్నికల అధికారులు స్వీకరించారు.పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 89 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు,దివ్యంగులు,అవసరమైన సేవల ఓటర్లు వంటి గైర్హాజరైన ఓటర్ల నుండి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం - 12డి లో మొత్తం 44,097 దరఖాస్తులు వచ్చాయి.అందులో 28,057 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ వెల్లడించారు.

అత్యధికంగా సిద్దిపేట లో

సిద్దిపేట నియోజికవర్గ పరిధిలో అత్యధికంగా 812 దరఖాస్తులకు గాను 757 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలిపారు.రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి 610 దరఖాస్తులు రాగా 339 దరఖాస్తులకు మాత్రమే అనుమతి దక్కింది.నిజామాబాద్ జిల్లా బాల్కొండ స్థానం నుండి 707 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల రాగా అన్నిటికీ అధికారులు అనుమతిచ్చారు.

ఖమ్మం జిల్లాలో సత్తుపెల్లి నియోజిక వర్గం నుంచి 706 దరఖాస్తులు అందగా వాటన్నిటికీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.నారాయణపేట నియోజికవర్గం నుంచి 28,వికారాబాద్ నుంచి 30 దరఖాస్తులు రాగా వాటి అనంటికి అధికారులు ఆమోదం తెలిపారు.ఇక బహదూర్ పుర నుంచి కేవలం 11 దరఖాస్తులు రాగా అన్నిటికీ అధికారులు అనుమతిచ్చారు.

వీరికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

వీటితో పాటు మొట్టమొదటి సరిగా 11 రకాల ప్రభుత్వ రంగ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.ఏర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,రైల్వేస్,ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో,దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో,ఎలక్ట్రిసిటీ వింగ్,ఫ్యామిలీ వెల్ఫేర్,రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ,ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్,బి ఎస్ ఎన్ ఎల్ఈ సి ద్వారా అనుమతి పొందిన మీడియా వ్యక్తులు,అగ్నిమాపక సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అర్హులు అని ఎన్నికల సంఘం వెల్లడించింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner