Telangana Congress Manifesto 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన మేనిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్. 42 పేజీల్లో 62 అంశాలను పేర్కొంది. ఇందులో అన్ని వర్గాలకు సంబంధించి అంశాలను ప్రస్తావించింది. కీలకమైన ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ ను తీసుకువస్తామని స్పష్టం చేసింది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటుతో పాటు నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తామని తెలిపింది.
ఇక రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచితంగా ఫ్రీవైపై ఇస్తామని తెలిపింది కాంగ్రెస్. ఇక ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేసింది. 2 లక్షల ఉద్యోగాల వివరాలను పేర్కొంటూ… భర్తీ చేసే తేదీలను కూడా పేర్కొంది. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డును ఇస్తామని తెలిపింది. టీఎస్పీఎస్సీ పరీక్షలకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ఇక రాష్ట్రంలో పూర్తిగా బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువస్తామని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రస్తావించింది. కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
-వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
-రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
-నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రజాదర్బార్ లు ,సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉంటుంది.
-అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ. 25 వేల పెన్షన్
-ఆరు నెలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ.
-రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఐఐఐటీలు ఏర్పాటు
-సీపీఎస్ రద్దు… ఓపీఎస్ అమలు
-ఆటో డ్రైవర్ కు ఏడాది రూ. 12 వేలు
-రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ
-న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5వేల గౌరవ భృతి.
-అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.
-హైదరాబాద్ విజన్ - 2023 పేరుతో అభివృద్ధి
-అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
-18 ఏళ్లు నిండిని విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ.