Bandi Sanjay: కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నాను - బండి సంజయ్
Bandi Sanjay: కేటీఆర్ సీఎం అయితే తెలంగాణలో హరీష్ రావు, కవిత, సంతోష్ ఔట్ అవుతారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఇంటి దేవుడికే శఠగోపం పెట్టిన ఘనుడని, వేములవాడ అభివృద్దిపై చర్చకు సిద్దమా అని సవాలు చేశారు.
Bandi Sanjay: వేములవాడ రాజన్న తన ఇలవేల్పు అని తన వివాహం కూడా ఇక్కడే అయ్యిందని పలు వేదికల నుండి చెప్పిన కేసీఆర్ వేములవాడ అభివృద్దికి రూపాయి కూడా కేటాయించలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
ట్రెండింగ్ వార్తలు
ఇంటి ఇలవేల్పు దేవుడికే శఠగోపం పెట్టే సంస్కృతి కేసీఆర్ దని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చెన్నమనేని వికాస్ కు మద్దతుగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు..భారీ సంఖ్యలో పాల్గొన్న అభ్యర్థులు కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికారు.
రాజన్న ఆలయ సమీపంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ, వేములవాడను అభివృద్ది చేయాలనే ఏకైక లక్ష్యంతో డాక్టర్ చెన్నమనేని వికాస్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారే తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరిగా దోచుకోవాలనే ఆలోచన లేదన్నారు.
రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వేములవాడ అభివ్రుద్ధికి చేసిందేమీ లేదని సంవత్సరానికి వందకోట్లని,గొప్పగా అభివృద్ది చేసుకుందామని ప్రగల్బాలు పలికిన సీఎం పత్తా లేకుండా పోయాడన్నారు. సీఎం కొడుకు నాస్తికుడని, హిందువులకు వ్యతిరేకి అని దర్గాను నిర్మించినా ఆశ్చర్యం అవసరం లేదన్నారు.
అభివృద్ధి గురించి తాను మాట్లాడుతుంటే… కేసీఆర్ మాత్రం బాబ్రీమసీదు కూల్చివేత గురించి మాట్లాడుతున్నారని,కరసేవలో పాల్గొన్నానని గర్వంగా చెబుతానని ఏం చేసుకుంటావో చేసుకొమ్మని తేల్చిచెప్పారు.
హిందూ సమాజమంతా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. పేపర్లు, టీవీలు చూసి మోసపోవద్దని గతంలో ఇలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేస్తే, జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటిందని, రాజరాజేశ్వరస్వామి ఆశీస్సులతో వేములవాడను అభివృద్ధి చేస్తామన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 12 శాతం ఓట్ల కోసం ఎంఐఎం వద్ద మోకరిల్లుతున్నారు అని టోపీలు పెట్టుకుని మసీదుకు వెళ్లి నమాజ్ పేరుతో ముస్లింలను మోసం చేస్తున్నారని, 12 శాతం మైనారిటీ ఓట్ల కోసం 80 శాతం హిందూ ఓట్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
హిందూ సమాజం ఆ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఓటు దెబ్బతో బీఆర్ఎస్ ,కాంగ్రేస్ పార్టీలు గాల్లో కలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒకటవ తేదీ నాడు జీతాలిచ్చే పరిస్థితి లేదని, అప్పులపాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎట్లా గట్టెక్కిస్తాయో చెప్పాలన్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నందున డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అన్ని విధాలా అభివ్రుద్ధి సాధ్యమన్నారు.వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం కాశీ మాదిరిగా అభివ్రుద్ధి చేయాల్సిన అవసరం ఉందని...వికాస్ రావును గెలిపిస్తే వారణాసి మాదిరిగా వేములవాడను సమగ్రాభివృద్ధి చేసి ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేస్తానన్నారు.
దేవస్థాన అభివృద్ధికి 400 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇంటికి సాగనంపాలన్నారు. వికాస్ రావును గెలిపించి డిసెంబర్ 3న స్వామివారి సన్నిధానం వద్ద సంబురాలు చేసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..
(రిపోర్టర్ గోపికృష్ణ ఉమ్మడికరీంనగర్ జిల్లా)
టాపిక్