Bandi Sanjay: రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ అంటున్న బండి సంజయ్-bandi sanjay said that congress and brs are competing only for the second position ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Bandi Sanjay Said That Congress And Brs Are Competing Only For The Second Position

Bandi Sanjay: రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ అంటున్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Nov 16, 2023 06:10 AM IST

Bandi Sanjay: తెలంగాణ ఎన్నికల్లో రెండో స్థానం కోసమే కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీఅభ్యర్ధి బండి సంజయ్ అన్నారు.

కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్

Bandi Sanjay: ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి బిఆర్‌ఎస్ అభ్యర్ధి గంగుల లక్ష సెల్ ఫోన్లను సిద్దం చేశాడని..ఓటుకు పదివేల రూపాయలు పంచడానికి సిద్దంగా ఉన్నాడని బండి సంజయ్ ఆరోపించారు. సాలు గంగుల.... సెలవు గంగుల... బై బై గంగుల అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. సాలు గంగుల.... ఇక సెలవు గంగుల... బై బై గంగుల... అంటూ యువకులతో కలిసి నినదించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంనగర్ లో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ లక్ష సెల్ ఫోన్లను పంచడానికి సిద్దం చేసినట్టుగా తెలుస్తోందని,ఓటుకు పదివేల రూపాయలు పంచడానికి సిద్దం చేసుకుని ఓట్లను కొనుగోలు చేయడం నమ్ముకున్నాడని, తాను మాత్రం ధర్మాన్ని, కరీంనగర్ ప్రజలనే నమ్ముకున్నానన్నారు.

ఓట్ల కోసం, సీట్ల కోసం పేర్లు, కులగోత్రాలు మార్చుకునే నీచమైన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్సేనని విమర్శించారు.‘రాహుల్ గాంధీ అసలు రౌల్ విన్సీ...అని రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ గాంధీగా మారారని, కేసీఆర్ కొడుకైన కల్వకుంట్ల అజయ్ రావు... కల్వకుంట్ల తారక రామారావుగా మారారని, కరీంనగర్ లో పోటీచేస్తున్న గంగుల కమలాకర్ ఎంఐఎం ఓట్ల కోసం దారుస్సలాం పోయి టోపీ పెట్టుకుని కరీంనగర్ కమ్రుద్దీన్ గా మారారని ఎద్దేవా చేశారు.

కరీంనగర్ అభివృద్ధికి ఏం చేశానో... ఎన్ని కేంద్ర నిధులు తెచ్చానో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరితే బీఆర్ఎస్ నేతలు ముఖం చాటేసారన్నారు. కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులన్నీ కేంద్రానివేనని తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం కోసం రూ.150 కోట్ల నిధులు నేను తీసుకొస్తే. తానే చేసినట్లు కొబ్బరికాయ కొట్టి ఫోజులిచ్చిన మోసగాడు గంగుల కమలాకర్ అని మండిపడ్డారు.

గంగుల పలు వేదికల నుండి మాట్లాడుతూ,ఆంధ్రా,తెలంగాణా సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని, టీఆర్ఎస్ పేరును తీసేసి బీఆర్ఎస్ గా పెట్టుకున్న మీకు తెలంగాణ పేరెత్తే అర్హత కూడా లేదన్నారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.

రాయలసీమకు పోయి చేపల పులుసు తిని తెలంగాణ సొమ్ముతో రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానన్నాడని.. అప్పుడు కేసీఆర్ ను నిలదీయని గంగుల ప్రస్తుతం రాజకీయాలకోసం కపట ప్రేమ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు...

ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మత గురువులను నమ్ముకుందని, బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీని పట్టుకుందని.. వాళ్ల మత గురువులు వచ్చి గల్లీ గల్లీ ప్రచారం చేస్తున్నారని. రెండు పార్టీలు సిగ్గు లేకుండా 12 శాతం ఓట్ల కోసం పనిచేస్తన్నాయని, హిందూ మతపెద్దలు, సాధు, సంతువులు, అర్చక సమాజం ప్రస్తుతమున్న పరిస్థితిని ఆలోచించాలన్నారు .

హిందూ సమాజ సంఘటిత శక్తిని ఏకం చేయడానికి అందరు బయటకు రావాలని,. లేనిపక్షంలో రెండు పార్టీలు హిందూ సమాజాన్ని చులకనగా చూసే ప్రమాదం ఉందని. బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకునే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లకు సూచించారు...ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ప్రజలముందుకు వెలుతున్న బీజేపీ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

రిపోర్టర్ గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా

WhatsApp channel