Bandi Sanjay: ఉద్యోగాలు అడిగితే దూషిస్తావా, కేటీఆర్‌‌కు కండ కావరమన్న బండి సంజయ్-bandi sanjay fire on ktr for making comments on unemployed youth ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Bandi Sanjay Fire On Ktr For Making Comments On Unemployed Youth

Bandi Sanjay: ఉద్యోగాలు అడిగితే దూషిస్తావా, కేటీఆర్‌‌కు కండ కావరమన్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Nov 22, 2023 07:18 AM IST

Bandi Sanjay: ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులను దూషిస్తావా, కేటీఆర్‌కు కండకావరం పెరిగిందని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

Bandi Sanjay: నిరుద్యోగులు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని నిరసన తెలిపితే… తప్పు చేశానని చెంపలేసుకోవాల్సిన కేటీఆర్ చెత్త నా కొడుకుల్లారా… సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడుతున్నాడని.. ఆయనకు అహంకారం ఎక్కువై..కండకావరం తలకెక్కిందని..బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని పలు డివిజన్లలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు పూలుచల్లి, తిలకం దిద్ది సంజయ్ కి నీరాజనం పట్టారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

కేసీఆర్‌కి వంద గదుల ప్రగతి భవన్ కావాలని ...నీ ఇంట్లో అందరికి ఉన్నతమైన కొలువులు కావాలి కానీ నిలువ నీడలేని పేదలకు మాత్రం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్ కుటుంబంలోని అందరికీ కొలువులిచ్చాడని తెలంగాణలోని నిరుద్యోగులు ఏం పాపం చేశారని, ఇంటికొక ఉద్యోగమైనా ఎందుకివ్వలేదని కనీసం నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా ఇవ్వకపోవడం భాధాకరమన్నారు. ఇదే అంశంపై తాను ప్రశిస్తే ప్రజల కోసం కొట్లాడితే 74 కేసులు పెట్టి జైలుకు పంపారని… బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులిద్దరిదీ భూకబ్జాల భాగోతమని తనది పోరాటాల చరిత్ర అన్నారు.

ప్రజలు ఎటువైపు ఉంటారో ఆలోచించి ఓటేయాలని కోరుతున్నానన్నారు.గంగుల కమలాకర్ మాటలను చూస్తే నవ్వు వస్తోందని,కమలాకర్ కేఏ పాల్ తమ్ముడుగా... జోకర్ మాదిరిగా మాట్లాడుతున్నడని…ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు.

తాను అవినీతిపరుడనని టిక్కెట్ ను రూ.20 కోట్లకు అమ్ముకున్నానని… ఆస్తులు సంపాదించాని.. డబ్బు సంచులున్నాయని.నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటే జాలి వేస్తోందన్నారు.

కేటీఆర్ కు కండ కావరం తలకెక్కిందని. నిరుద్యోగులు ఉద్యోగాలెందుకివ్వడం లేదని నిరసన తెలిపితే… తప్పు చేశానని చెంపలేసుకోవాల్సిన కేటీఆర్, చెత్త నాకొడుకుల్లారా… సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడుతున్నాడని..తండ్రీ కొడుకులకు అహంకారం ఎక్కువైందని. తెలంగాణలోని యువకులంతా వాళ్లకు ఓటుతో బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

(రిపోర్టర్ గోపికృష్ణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

WhatsApp channel