TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల…11 ఎమ్మెల్యే, 13ఎంపీ అభ్యర్థుల ఖరారు-tdp third list released 11 mla and 13 mp candidates finalized ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Third List: టీడీపీ మూడో జాబితా విడుదల…11 ఎమ్మెల్యే, 13ఎంపీ అభ్యర్థుల ఖరారు

TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల…11 ఎమ్మెల్యే, 13ఎంపీ అభ్యర్థుల ఖరారు

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:16 AM IST

TDP Third List: అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితాను విడుదల చేసింది. 11మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు, 13మంది ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది.

టీడీపీ మూడో జాబితా విడుదల
టీడీపీ మూడో జాబితా విడుదల

TDP Third List: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ విడుదల చేసింది. మూడో జాబితాలో కూడా టీడీపీ సీనియర్లు దేవినేని ఉమా, కళా వెంకట్రావు, గంటా వంటి వారి పేర్లు గల్లంతయ్యాయి.

టీడీపీ పోటీ చేసే 144 స్థానాల్లో 16 నియోజక వర్గాలకు అభ్యర్ధులను పెండింగ్‌లో ఉండగా వాటిలో 11పేర్లను తాజా జాబితాలో ఖరారు చేశారు. పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో 11మంది అభ్యర‌్ధుల్ని ఖరారు చేశారు. ఎచ్చెర్ల, భీమిలీ, చీపురుపల్లి, అనంతపురం స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. .

ఎచ్చెర్లలో కళా వెంకట్రావు పార్టీ సీనియర్‌గా ఉన్న మూడో జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయారు. ఎచ్చెర్ల బీజేపీకి వెళితే కళా వెంకట్రావు సీటును వదులుకోవాల్సి ఉంటుుంది.

భీమిలీలో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు సీటు ఆశిస్తున్నారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినా గంటా విముఖత చూపడంతో దానిని పెండింగ్‌లో పెట్టారు. దీంతో చీపురుపల్లిలో కూడా ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అనంతపురం అర్బన్‌ నియోజక వర్గాన్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనతో దానిని పెండింగ్‌లో ఉంచారు. దర్శి నుంచి శిద్దా రాఘవరావు పోటీ చేయించాలని యోచిస్తున్నారు. శిద్దా రాఘవరావు కోసం పెండింగ్ ఉంచినట్టు చెబుతున్నారు.

మరోవైపు బీజేపీకి కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు. టీడీపీతో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అటు జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా ఇంకా కొలిక్కి రాలేదు.

టీడీపీ మూడో జాబితా ఇదే…

టీడీడీపీ మూడో జాబితాలో 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించారు.

పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావు ,శ్రీకాకుళం-గొండు శంకర్ శృంగవరపు కోటలో - కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్, నరసారావుపేట-చదలవాడ అరవింద్ బాబు, చీరాల - మద్దులూరి మాలకొండయ్య, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ ఉన్నారు.

మైలవరం, పెనమలూరు స్థానాల్లో పోటీ కోసం మాజీ మంత్రి దేవినేని ఉమా చివరి వరకు ప్రయత్నం చేసినా ఆయనకు టిక్కెట్ దక్కలేదు.

టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే…

1. శ్రీకాకుళం : కింజారపు రామ్మోహన్ నాయుడు

2. విశాఖపట్నం : మాత్కుమిల్లి భరత్

3. అమలాపురం : గంటి హరీష్

4. ఏలూరు : పుట్టా మహేష్ యాదవ్

5. విజయవాడ : కేశినేని చిన్ని

6.గుంటూరు : పెమ్మసాని చంద్రశేఖర్

7.నరసరావుపేట : లావు శ్రీకృష్ణదేవరాయలు

8.బాపట్ల : టి.కృష్ణప్రసాద్

9. నెల్లూరు : వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

10.చిత్తూరు : దగ్గుమళ్ల ప్రసాద్ రావు

11.కర్నూలు : బస్తిపాటి నాగరాజు

12.నంద్యాల : బైరెడ్డి శబరి

13.హిందూపురం : బీకే.పార్థసారధి

తాజాగా ప్రకటించిన అభ్యర్థుల్లో 25-35ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఇద్దరు,.36-45 ఏళ్ల మధ్య వయసున్న వారు ఐదుగురు, 46-60 మధ్య వయసున్న వారు ఇద్దరు, 61-75 ఏళ్ల మధ్య వయసున్న వారు నలుగురు ఉన్నారు. పురుషులు 12మంది మహిళలు ఒక్కరున్నారు. ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు ఇద్దరు, డాక్టర్లు ఇద్దరు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముగ్గురు, అండర్ గ్రాడ్యుయేట్లు ఆరుగురు ఉన్నారు.

సంబంధిత కథనం