Nizamabad News : ప్రచారం ముగిసింది, ప్రలోభాలు మొదలయ్యాయ్!-nizamabad news in telugu election campaign completed candidates voter temptations start ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Nizamabad News In Telugu Election Campaign Completed Candidates Voter Temptations Start

Nizamabad News : ప్రచారం ముగిసింది, ప్రలోభాలు మొదలయ్యాయ్!

HT Telugu Desk HT Telugu
Nov 28, 2023 06:45 PM IST

Nizamabad News : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థుల ప్రచారాలు ముగిశాయి. దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్లు సమాచారం. కుల సంఘాల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టిందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటర్లు
ఓటర్లు

Nizamabad News : శాస‌న‌స‌భ ఎన్నికల నేప‌థ్యంలో గ‌త కొన్ని రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్మోగిన ప్రచారానికి మంగ‌ళ‌వారం ఐదు గంట‌ల‌తో తెర‌ప‌డింది. రెండు వారాలుగా కాళ్లకు చక్రాలు పెట్టకున్నట్టు తిరిగిన అభ్యర్థులు త‌మ ఇళ్లకు ప‌రిమిత‌మ‌య్యారు. ఇక చివ‌రి రోజు సైతం బైక్ ర్యాలీలు, పాద‌యాత్రలు చేప‌ట్టారు. నిజామాబాద్ అర్బన్‌తో పాటు రూర‌ల్‌, ఆర్మూరు, కామారెడ్డి, బాన్సువాడ‌లో ఐదు గంట‌ల వ‌ర‌కు జోరుగా ప్రచారం సాగింది. అయితే ప్రచారం ముగియ‌డంతో ఇక ప్రలోభాల‌కు తెర‌లేపేందుకు రాజ‌కీయ పార్టీలు ప్రయ‌త్నాలు ముమ్మరం చేశాయి. ఈ రెండు రోజులు ఏ ఒక్క అవ‌కాశాన్ని జార విడ‌వ‌నీయ‌కుండా ఓట‌ర్లను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా అన్నీ రాజ‌కీయ పార్టీలు కుల సంఘాల‌పై దృష్టి కేంద్రీక‌రించాయి. అన్నీ పార్టీల నుంచి ఈసారి బ‌ల‌మైన అభ్యర్థులు బ‌రిలోకి దిగారు. ఏ అభ్యర్థి గెలిచినా త‌క్కువ మెజార్టీతో బ‌య‌ట‌ప‌డ‌తాడ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రతి ఓటు లెక్కను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి బుధ‌వారం రాత్రి వ‌ర‌కు కుల సంఘాల ద్వారా ఓట‌ర్ల సంఖ్యను బ‌ట్టి డ‌బ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నిక‌ల సంఘం నిఘా నేప‌థ్యంలో న‌మ్మక‌స్తుల ద్వారా ఈ తంతు పూర్తి చేసేలా ఆలోచ‌న చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్ శాండిల్య ప్రకటించారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం షాపులు మూసివేసే ఉంటాయన్నారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు నిలిపివేసినట్లు సీపీ తెలిపారు. ఎన్నికల ముగిసే వరకు హైదరాబాద్ లో 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమ్మిగడితే చర్యలు తప్పవన్నారు. వైన్ షాపులు, బార్లు, పబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశించారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించామన్నారు.

పోలీస్ బందోబస్తు

తెలంగాణ ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. 45 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలు, 3 వేల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. కర్ణాటక నుంచి 5వేలు, మహారాష్ట్ర నుంచి 5వేలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2500, మధ్యప్రదేశ్ నుంచి 2000, ఒడిశా నుంచి 2000 మంది హోంగార్డులను ఎన్నికల బందోబస్తులో ఉంచామన్నారు.

WhatsApp channel