Chief election commissioner : నూతన సీఈసీ నియామకం- ఎవరు ఈ జ్ఞానేశ్ కుమార్?
Gyanesh Kumar CEC : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ని నియమించారు. ఈయన పేరును ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది.

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన స్థానంలో జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
నూతన ఎన్నికల కమిషనర్..
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టం ప్రకారం ఈ పదవికి నియమితులైన తొలి సీఈసీగా నిలిచారు జ్ఞానేశ్ కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ పేరును ఖరారు చేశారు.
సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. సెర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్లో ఒకరి పేరును సిఫారసు చేసింది.
మరోవైపు1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ డాక్టర్ వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటనలో ఉంది.
ఎవరీ జ్ఞానేశ్ కుమార్?
- 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ అధికారి జ్ఞానేశ్ కుమార్ గత ఏడాది జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
- నూతన సీఈసీగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్ 2022 మే నుంచి అమిత్ షా మంత్రివర్గంలో కార్యదర్శిగా పనిచేశారు.
- జ్ఞానేశ్ కుమార్ మొదట మే 2016 నుంచి సెప్టెంబర్ 2018 వరకు సంయుక్త కార్యదర్శిగా, తరువాత సెప్టెంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2021 వరకు అదనపు కార్యదర్శిగా హోం శాఖలో ఐదేళ్లు పనిచేశారు.
- 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అదనపు కార్యదర్శిగా ఆయన జమ్ముకశ్మీర్ డెస్క్‌కి నేతృత్వం వహించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అమిత్ షాతో కలిసి ఆయన పార్లమెంటుకు వెళ్లేవారని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.
- సుఖ్బీర్ సింగ్ సంధుతో పాటు జ్ఞానేశ్ కుమార్ గత ఏడాది మార్చ్‌లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.
- కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పట్టా పొందారు నూతన సీఈసీ. కుమార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు.
సంబంధిత కథనం