Tukkuguda Jana Jatara : ఈ నెల 6న తుక్కుగుడాలో కాంగ్రెస్ జన జాతర సభ, 5 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటన!-tukkuguda congress jana jatara meeting lok sabha elections manifesto released ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tukkuguda Jana Jatara : ఈ నెల 6న తుక్కుగుడాలో కాంగ్రెస్ జన జాతర సభ, 5 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటన!

Tukkuguda Jana Jatara : ఈ నెల 6న తుక్కుగుడాలో కాంగ్రెస్ జన జాతర సభ, 5 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటన!

HT Telugu Desk HT Telugu
Published Apr 03, 2024 09:51 PM IST

Tukkuguda Jana Jatara : పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ నుంచి శంఖారావం పూరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తుంది. ఈ నెల 6న తుక్కుగుడాలో నిర్వహించే జన జాతర సభలో 5 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటించనున్నారు.

తుక్కుగుడాలో కాంగ్రెస్ జన జాతర సభ
తుక్కుగుడాలో కాంగ్రెస్ జన జాతర సభ

Tukkuguda Jana Jatara : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు(Lok Sabha Elections 2024) తెలంగాణ గడ్డ మీద నుంచే మరోసారి కాంగ్రెస్(Congress) శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ను తెలంగాణ గడ్డ మీద.....అదీ శాసనసభ ఎన్నికలకు సమర శంఖం పూరించిన తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో(Congress Manifesto) పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఐదు గ్యారంటీలను(Congress Guarantees) కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించనుంది. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభను (Tukkuguda Jana Jatara)కాంగ్రెస్ నిర్వహించనుంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం సుమారు 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500 లకే గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇండ్ల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది.

10 లక్షల మంది ప్రజలతో జనజాతర సభ

ఈనెల 6న తుక్కుగుడా వేదికగా జరగబోయే జన జాతర సభకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు.....అన్ని గ్రామాలు, పట్టణాలు ,నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది ప్రజలను సమీకరించాలని పార్టీ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తుక్కుగూడ జన జాతర సభ ప్రాంగణాన్ని సందర్శించి...... సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజల సభకు తరలి వచ్చినా..... ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని నేతలకు రేవంత్ ఆదేశించారు.

తుక్కుగుడా నుంచే ఎందుకంటే?

శాసనసభ ఎన్నికలకు(Assembly Elections) ముందు తుక్కుగూడ నుంచే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సమర శంఖం పూరించి సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలోనే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) ఆరు గ్యారంటీలను ప్రకటించారు. ఆమె ప్రకటించిన గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ క్రమంలోనే కలిసి వచ్చిన తుక్కుగుడా గడ్డపై మరోసారి లోక్ సభ ఎన్నికలకు(Lok Sabha Electoins) సమర శంఖం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

మరోసారి రేవంత్ మాటలు నిజం కానున్నాయా?

తుక్కుగూడ వేదికగా(Tukkuguda) నిర్వహించిన విజయభేరీ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రజలంతా ఆహ్వానితులేనని విశ్వాసంతో ప్రకటించారు. రేవంత్ చెప్పిన మాటలే అక్షరాలా నిజం అయ్యాయి. ఆయన చెప్పినట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9కి రెండు రోజుల ముందే రేవంత్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తుక్కుగూడ వేదికగా సభ ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన సమయంలో ) కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఢిల్లీ రాంలీల మైదానంలో లక్షలాది ప్రజల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కొలువు తీరుతుందని జూన్ 9న ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని ప్రకటించారు. శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పిన ప్రతి మాట ప్రజల్లో బలమైన ముద్ర వేయడంతో పాటు నిజమవ్వడంతో ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. రేవంత్ చెప్పిన మాటలు మరోసారి నిజం అవుతాయా? అనేది చూడాలి.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం