PM Modi RoadShow: రేపు విజయవాడలో ప్రధాని రోడ్ షో, చెన్నై, కోల్‌కత్తా జాతీయ రహదారులపై ఆంక్షలు
PM Modi RoadShow: ప్రధాని నరేంద్ర మోదీ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం విజయవాడ ఎంజీ రోడ్‌లో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.
PM Modi RoadShow: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రోడ్ షో నిర్వహించనుండటంతో చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించాురు.
విజయవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు, ఓల్డ్ పి.సి.ఆర్. జంక్షన్ నుండి బెంజ్ సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ఏరియాను రెడ్ జోన్ ( నో ఫ్లయింగ్ జోన్ ) గా ప్రకటించారు. విజయవాడలోని మూడు నియోజక వర్గాల పరిధిలో ప్రధాని రోడ్ షో జరిగే అవకాశం ఉంది.
ఈ ప్రాంతంలో డ్రోన్స్, బెలూన్స్ ఎగరవేయడాన్ని నిషేధించారు. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ హెచ్చరించారు.
గన్నవరం విమానాశ్రయం నుండి పి.వి.పి.మాల్ వరకు, బెంజ్ సర్కిల్ నుండి గన్నవరం విమానాశ్రయం వరకు రూట్ బందోబస్త్ పర్యవేక్షించారు. నగరంలోని పి.వి.పి.మాల్ నుండి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున సాగుతుంది.
ప్రధాని పర్యటన బందోబస్తు కోసం రోడ్ షో ఏరియా మరియు పరిసర ప్రాంతాలలలో ఏరియా డామినేషన్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, కట్ ఆఫ్ పార్టీస్, రూఫ్ టాప్స్, రోప్ పార్టీస్, యాంటిసబ్ టేజ్ చెక్, వివిధ బృందాలను ఏర్పాటు చేసి, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 5000 మంది లా & ఆర్డర్, ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి., పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాట్లను చేశారు.
రోడ్ షో సాగుతుంది ఇలా…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8వ తేదీన మహాత్మా గాంధీ రోడ్డులో ఎన్డీయే కూటమి పార్టీల తరపున నిర్వహించే రోడ్ షోకు వస్తుండటంతో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ నగరంలో, నగరం మీదుగా వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు.
8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గంటల వరకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు రోడ్ షో ఉంటుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రద్దీ దృష్ట్యా విమాన ప్రయాణికులు నిర్ణీత సమయం కంటే ముందుగా గన్నవరం విమానాశ్రయం చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీపీ సూచించారు..
- బెంజిసర్కిల్ నుంచి పాతబస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ వై జంక్షన్ వరకు.. బందరు రోడ్డుకు ఇరు వైపులా ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఆ వాహనా లను కారల్ మార్క్స్ రోడ్డు లేదా కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- రామవరప్పాడు వైపు నుంచి వచ్చే వాహనాలను మహానాడు జంక్షన్, ఆటోనగర్, పటమట, ఎన్టీ ఆర్ సర్కిల్, కృష్ణవేణి రోడ్డు, రామ లింగేశ్వరనగర్, స్క్యూ బ్రిడ్జి మీదుగా వారధి వైపు మళ్లిస్తారు. పటమట నుంచి బెంజిసర్కిల్ వైపు వచ్చే వాహనాలను ఆటోనగర్ నుంచి కారల్మా ర్క్స్ రోడ్డులోకి, పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రామలింగేశ్వరనగర్ మీదుగా వెళ్లాలి.
- అంతర్గత రహదారులు నుంచి మహాత్మా గాంధీ రోడ్డులోకి ఎలాంటి వాహనాలను అనుమతించరు.
ఆర్టీసీ, సిటీ బస్సులకు ఆంక్షలు (మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు)
- మహాత్మాగాంధీరోడ్డు, రూట్ నంబర్-5 లో ఆర్టీసీ వై. కూడలి నుంచి బెంజిసర్కిల్ వైపు, బెంజిసర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వైపు సిటీ బస్సులు అనుమతించరు. వీటిని ఏలూరు రోడ్డులోకి మళ్లిస్తారు.
- మచిలీపట్నం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఆటో నగర్, మహానాడు జంక్షన్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు బి.ఆర్.టి.ఎస్.రోడ్డు మీదుగా మళ్లి స్తారు. ఏలూరు వైపు నుంచి వచ్చే బస్సులు కూడా రామవరప్పాడు రింగ్ మీదుగా ఇదే మార్గంలో వెళ్లాలి.
విజయవాడలో పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
వీఐపీలు…
ఐజీఎంసీ స్టేడియం హ్యాండ్ బాల్ కోర్ట్
పోలీసు అధికారులకు సిటీ ఆర్మ్డ్ గ్రౌండ్స్
పార్టీ నాయకులకు బిషప్ అజరయ్య స్కూలు గ్రౌండ్ కేటాయించారు.
ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల నుంచి వచ్చే వాహనాలు సీఎస్ఐ చర్చి గ్రౌండ్, రైల్వే ఫంక్షన్ హాల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానం
కృష్ణా జిల్లా నుంచి వచ్చే వాహనాలు… సిద్ధార్థ హోటల్ "మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా కార్లు, ద్విచక్రవాహనాలను బి. ఆర్. టి. ఎస్. రోడ్డు మధ్యభాగం జ్యోతి కన్వెన్షన్, వేదిక ఎస్.వి.ఎస్. కల్యాణ మండపం వద్ద పార్క్ చేయాలి.
విజయవాడ మీదుగా వెళ్లే భారీ వాహనాలు...
- హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే సరకు రవాణా వాహనాలను 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇబ్రహీంపట్నం వద్ద నుంచి మళ్లిస్తారు. మైలవరం, తిరువూరు, సత్తుపల్లి, అశ్వారావుపేట వైపు మళ్లిస్తారు.
- విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే సరకు రవాణా వాహనా 'లను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లించి, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి వారది. రేపల్లె, బాపట్ల, త్రోవగుంట వైపు మళ్లిస్తారు(ఇరువైపులా ట్రాఫిక్ మళ్లిస్తారు).