PM Modi: ‘బుల్డోజర్ ను ఎప్పుడు, ఎలా వాడాలో యోగిని చూసి నేర్చుకోండి’: ప్రధాని మోదీ-pm modi to india bloc learn from yogi adityanath where to run bulldozer ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi: ‘బుల్డోజర్ ను ఎప్పుడు, ఎలా వాడాలో యోగిని చూసి నేర్చుకోండి’: ప్రధాని మోదీ

PM Modi: ‘బుల్డోజర్ ను ఎప్పుడు, ఎలా వాడాలో యోగిని చూసి నేర్చుకోండి’: ప్రధాని మోదీ

HT Telugu Desk HT Telugu
May 17, 2024 06:50 PM IST

PM Modi: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా, ఐదో దశలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. దేశంలో అస్థిరతను రెచ్చగొట్టడానికే విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్ సభ ఎన్నికల బరిలో ఉందని ప్రధాని మోదీ విమర్శించారు.

యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PTI)

lok sabha elections 2024: తాము అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరంపై సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లు బుల్ డోజర్ నడుపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్యూషన్ తీసుకోవాలని ఆయన అన్నారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే రామ్ లల్లా మళ్లీ టెంట్ లోకి వెళ్తారని, కొత్తగా నిర్మించిన రామ మందిరంపై వారు బుల్డోజర్ నడుపుతారని అన్నారు. ‘ఎక్కడ బుల్డోజర్ నడపాలి, ఎక్కడ నడపకూడదు అని తెలుసుకోవడానికి వారు యోగి జీ (యోగి ఆదిత్యనాథ్) వద్ద ట్యూషన్ తీసుకోవాలి’ అని ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ అన్నారు.

దేశం కోసం ఎన్డీఏ

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దేశంలో అలజడులు సృష్టిస్తోందన్నారు. ఎన్నికలు జరుగుతున్న కొద్దీ విపక్ష కూటమి సభ్యులు చీలిపోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అస్థిరతను రెచ్చగొట్టడానికే లోక్ సభ ఎన్నికల బరిలో ఇండియా కూటమి ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. వరుసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు.

అఖిలేశ్ కు కొత్త అత్త

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కు మమతా బెనర్జీ రూపంలో కొత్త అత్త దొరికిందని ప్రధాని మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘సమాజ్ వాదీ యువరాజుకు (అఖిలేష్ యాదవ్) కొత్త అత్త (మమతా బెనర్జీ) ఆశ్రయం లభించింది. ఈ కొత్త అత్త బెంగాల్ లో ఉంటుంది. నేను మీకు బయటి నుంచి మద్దతిస్తానని ఈ ఆంటీ ఇండియా కూటమికి చెప్పింది’’ అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అఖిలేష్ యాదవ్ తన మాజీ మిత్రపక్షం, బీఎస్పీ అధినేత్రి మాయావతిని గతంలో బువా (అత్త) అని పిలిచేవాడన్న విషయం తెలిసిందే.

దేశాన్నే విభజించారు.. వారు ఏమైనా చేయగలరు

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును రివర్స్ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఇది ఎలా సాధ్యమని కొందరు ఆశ్చర్యపోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు... స్వాతంత్య్రోద్యమ సమయంలో దేశాన్ని విభజించడం గురించి మాట్లాడితే, ఒక దేశాన్ని విభజించలేమని ప్రజలు నమ్మేవారు. అయితే, దేశ విభజన జరిగింది. వారు (కాంగ్రెస్) ఎంతవరకైనా వెళ్లగలరు. వారి ట్రాక్ రికార్డ్ అలాంటిది. వారికి దేశం అంటే విలువ లేదు. వారికి కుటుంబం, అధికారమే సర్వస్వం’’ అని నరేంద్ర మోదీ విమర్శించారు.

Whats_app_banner