PM Modi nomination : అంగరంగ వైభవంగా.. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
PM Modi Varanasi nomination :2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ.. తాజాగా తన నామినేషన్‌ని దాఖలు చేశారు. ఎన్డీఏ పక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Lok Sabha elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వారణాసి నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ కార్యకర్తలు, ప్రజల కోలాహలం మధ్య.. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అంగరంగ వైభవంగా ప్రధాని నామినేషన్ ప్రక్రియ..
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ ప్రక్రియ అంగరంగ వైభవంగా జరిగింది. నామినేషన్‌ని దాఖలు చేసేందుకు సోమవారం సాయంత్రం వారణాసి వెళ్లిన ఆయన.. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
మోదీ నామినేషన్ కోసం వారణాసిలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఎటు చూసినా కాషాయ రంగే కనిపిస్తోంది. ఫ్లేక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఇక మోదీని చూసేందుకు ప్రజలు భారీ లైన్లలో నిలబడ్డారు.
మంగళవారం ఉదయం వారణాసిలో ఘాట్‌కి వెళ్లి పూజలు చేశారు. అనంతరం.. అక్కడి నుంచి కాలభైరవుడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ ఉన్నారు.
Modi nomination in Varanasi : అక్కడి నుంచి.. ఉదయం 11:30 ప్రాంతంలో.. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11:40- మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తన నామినేషన్‌ని దాఖలు చేశారు. ఈ సమయంలో పుష్యమి నక్షత్రం, గంగా సప్తమి ఉండటంతో.. ఇది పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో ఏం కోరుకున్నా, అది కచ్చితంగా నేరవేరుతుందని హిందువుల నమ్మకం. అందుకే మోదీ కూడా ఈ సమయాన్ని ఎంచుకున్నారు.
ఇక.. మోదీ నామినేషన్ దాఖలు ప్రక్రియలో.. కేంద్ర మంత్రులతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌తో పాటు మొత్తం మీద 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇటీవలే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం.. ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
PM Modi latest news : ఎన్నికల్లో పోటీ చేసేందుకు, అఫిడవిట్లో నలుగురి ప్రతిపాదనలతో సంతకాలు కావాలి. మోదీ కోసం.. పండిత్ గణేశ్వర్ శాస్త్రి, బైజ్యనాథ్ పటేల్, లాల్‌చంద్ కుశ్వాహ, సంజయ్ సోంకర్‌లు ప్రతిపాదన చేశారు.
2014 నుంచి వారణాసి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మోదీ. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. మూడోసారి అధికారాన్ని చేపట్టాలని మోదీ, బీజేపీ భావిస్తోంది. 7 దశల పోలింగ్ ప్రక్రియలో ఇప్పటికి 4 దశలు పూర్తయ్యాయి. చివరి దశ అయిన జూన్ 1న.. వారణాసిలో పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
సంబంధిత కథనం