BJP GVL Tragedy: పాపం జివిఎల్... మూడేళ్లు పని చేసినా ఫలితం లేకపోయింది... టిక్కెట్ ఆశలు గల్లంతు
BJP GVL Tragedy: ఎన్నికల పొత్తుల్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు ఉదంతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న జివిఎల్‌కు నిరాశ తప్పలేదు.
BJP GVL Tragedy: యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జివిఎల్ నరసింహరావు దాదాపు రెండున్నరేళ్లుగా విశాఖలో హడావుడి చేస్తున్నాBJP అభ్యర్థుల ఎంపికలో మాత్రం నిరాశ Disappointment తప్పలేదు. విశాఖకు Visakhapatnam రైల్వే జోన్ వచ్చేస్తోంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందంటూ తరచూ హడావుడి చేస్తూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనా ఫలితం లేకపోయింది.
ప్రకాశం జిల్లాకు చెందిన జివిఎల్ GVl మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పనిచేసిన సమయంలో ఆయన వద్ద సుదీర్ఘ కాలం పనిచేశారు. 2005-2018 మధ్య కాలంలో మధ్యప్రదేశ్‌లో చౌహాన్ సిఎంగా ఉన్న సమయంలో జివిఎల్ నరసింహరావు ఆయన కార్యాలయంలో సుదీర్ఘ కాలం పని చేశారు.
కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేసి అందరిలో గుర్తింపు పొందారు. ఈవిఎం యంత్రాలను ప్రవేశపెడుతున్న సమయంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం పేరుతో విస్తృత ప్రచారం చేశారు. ఈవిఎంల వ్యతిరేక ఉద్యమానికి సారథ్యం వహించిన వారిలో జివిఎల్ కూడా ఉన్నారు.
2018లో ఎంపీగా ఎన్నికైనా 2019 తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు జివిఎల్ నరసింహరావు పేరు ఏపీలో పెద్దగా ఎవరికి తెలియదు. బీజేపీ అగ్రనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే గుంటుపల్లి వెంకట లక్ష్మీ నరసింహరావు అలియాస్ జివిఎల్‌కు రాజ్యసభ సీటు వరించింది.సామాజిక సమీకరణలు, బీజేపీ పెద్దల ఆశీస్సులు కలిసొచ్చాయని చెబుతారు. రాజ్యసభకు ఎన్నిక కావడానికి ముందు బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ అందరికి చేరువయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా బల్లికురువ గ్రామానికి చెందిన జివిఎల్ పూర్వీకులు తర్వాత నరసరావు పేటలో స్థిరపడ్డారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేసిన తర్వాత గుజరాత్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబిఏ పూర్తి చేశారు.
జివిఎల్‌ను రాజ్యసభకు ఎంపిక చేసే సమయంలోనే యూపీ వ్యవహారాలతో సంబంధం ఉండదనే స్పష్టత కూడా ఆయనకు ఇవ్వడంతోనే ఏపీపై ఫోకస్ పెట్టినట్టు సన్నిహితులు చెబుతారు. జివిఎల్ తో పాటు పీయూష్ గోయల్ వంటి సీనియర్లకు సైతం రాజ్యసభ స్థానాలపై ఆశలు పెట్టుకోవద్దని పార్టీని బలోపేతం చేయడంపై ముఖ్య నేతలు కూడా ఎన్నికల బరిలో దిగాల్సిందేనని బీజేపీ BJP అధిష్టానం చాలా రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చేసింది. పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, చంద్రశేఖర్, మన్‌సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
బీజేపీ అంతగా బలం లేని రాష్ట్రాల్లో క్యాడర్‌ను బలోపేతం చేయడంపైనే చాలా ఏళ్లుగా ఫోకస్ పెట్టింది. ట్రైబల్ ఏరియాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో బలం కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో పొత్తులో భాగంగా అరకు సీటును బీజేపీ తీసుకోడానికి కారణం ఇదేనని చెబుతున్నారు. గిరిజన ప్రాంతాలపై బీజేపీ కొన్నేళ్లుగా ఫోకస్ చేయడంతో ఆ పార్టీ కాన్ఫిడెంట్‌గా ఉంది.మరోవైపు మరికొద్ది రోజుల్లో జివిఎల్ పదవీ కాలం ముగియనుండగా అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.
బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినపుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాల్సి ఉంటుందనే స్పష్టత ఇవ్వడంతో విశాఖపట్నం ఎంపిక చేసుకున్నారు. ఏపీలో ఇతర నియోజక వర్గాల కంటే విశాఖపట్నం అన్ని విధాలుగా అనుకూలిస్తుందని ఆయన భావించారు. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోవడంతో విశాఖ వంటి కాస్మోపాలిటిన్ నగరంలో అన్ని నగరాలకు చెందిన ప్రజలు నివసిస్తారనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు.
విశాఖపట్నం లోక్‌సభ స్థానం కోసం పురందేశ్వరి కూడా ప్రయత్నించినా ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీడీపీ తరపున 2019లో విశాఖపట్నంలో గీతం యూనివర్శిటీ భరత్ పోటీ చేశారు. ఆ టిక్కెట్ కోసం టీడీపీ పట్టుబడుతుందని గ్రహించి ఆమె రాజమహేంద్ర వరం నుంచి పోటీకి మొగ్గు చూపారు. అనుకున్నట్టే అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు రాజమహేంద్రవరంలో ఖరారైతే జివిఎల్ పేరు మాత్రం గల్లంతైంది.
జివిఎల్‌కు టిక్కెట్ దక్కకపోవడానికి మరో కారణం కూడా ఉందని బీజేపీ నేతల్లో ప్రచారం ఉంది. వైసీపీ అనుకూలుడిగా జివిఎల్‌కు ముద్ర వేయడంలో ప్రత్యర్థులు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి పోటీ చేయాలనే ఆలోచనను ముందే వైసీపీతో సర్దుబాటుకు ప్రయత్నించారని బీజేపీ నేతలు అనుమానించారని చెబుతున్నారు.విశాఖలో సీటు దక్కకపోవడానికి ఇది కూడా కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అభిమానానికి సంతోషం....
బీజేపీ అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంపై విశాఖ ప్రజలకి , కార్యకర్తలకి జివిఎల్ వీడియో సందేశం పంపారు. విశాఖ సీటు రాకపోవడంపై విశాఖ వాసులు బాధపడ్డారని, విశాఖ ప్రజల అభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉందని, మూడేళ్లగా విశాఖ అభివృద్దికి, విశాఖ ప్రజలకి సేవకి సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రజలకి మంచి జరగాలని నిస్వార్ధంగా సేవ చేశానని, విశాఖ అభివృద్దికి చేసిన సేవ వృధా అయిందని భావించొద్దన్నారు.
ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ చేయలేదని, జివిఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ అని ప్రకటించారు. త్వరలోనే విశాఖ వచ్చి మీ అందరినీ కలుస్తానని చెప్పారు. విశాఖ అభివృద్దే లక్ష్యమని, విశాఖలోనే ఉంటూ భవిష్యత్ లో విశాఖ అభివృద్దికి మీ అందరితో కలిసి కృషి చేస్తానని చెప్పారు.
సంబంధిత కథనం