Ponnam Prabhakar: బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం.. నేతన్నలపై మొసలి కన్నీరని విమర్శలు-minister ponnam prabhakar is angry with brs and bjp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ponnam Prabhakar: బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం.. నేతన్నలపై మొసలి కన్నీరని విమర్శలు

Ponnam Prabhakar: బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం.. నేతన్నలపై మొసలి కన్నీరని విమర్శలు

HT Telugu Desk HT Telugu
Apr 09, 2024 07:15 AM IST

Ponnam Prabhakar: సిరిసిల్ల నేత కార్మికుల విషయంలో బిఆర్ఎస్ బిజెపి నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పొన్నం ప్రభాకర్
బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: బీఆర్‌ఎస్‌ BRS, బీజేపీ BJPలు రెండు పార్టీలు నేతన్నలకు చేసింది ఏమీ లేదని పొన్నం విమర్శించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి సిరిసిల్ల Siricillaలో మంత్రి  Ponnamపన్ను మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ తీరు బిజెపి వైఖరి పై మండిపడ్డారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏమీ చేయలేని బిఆర్ఎస్, బిజెపి నేతలు ప్రస్తుతం నేతన్నల విషయంలో శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నేతన్నలకు భరోసా ఇవ్వడానికే సిరిసిల్లకు వచ్చినట్లు తెలిపారు.

బకాయిలన్ని ఇచ్చేస్తాం.. 365 రోజులు ఉపాధి కల్పిస్తాం

సిరిసిల్ల Chenetha నేత కార్మికులకు రావలసిన బకాయిలు 350 కోట్లు విడుదలకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. విడతల వారీగా బకాయిలన్నీ ఇచ్చేస్తామని ప్రకటించారు. నేత కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తామని...365 రోజులు పని ఉండేలా కొత్త ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. నేతన్నలకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు.

నేతన్నలు నేసిన వస్త్రాలను Congress ప్రభుత్వమే తీసుకోవాలని జీవో తీసుకొచ్చామని తెలిపారు. మూడు నెలలలో సిరిసిల్లకు 130 కోట్ల ఆర్డర్స్ ఇచ్చామని చెప్పారు. ఇక్కడి నుండి వస్త్ర పరిశ్రమ ఎగుమతులు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేతన్నల కు రెండు చేతులు జోడించి దండం పెట్టి చెపుతున్న చావులతో సమస్యలు పరిష్కారంకావన్నారు.

గత ప్రభుత్వాలు ఏ పథకాలు ప్రారంభించి నేతన్నలకు చేసిన సహాయం కంటే ఒక్క రూపాయి ఎక్కువే ఇచ్చి ఆదుకుంటాని ప్రకటించారు. నేతన్నల బకాయిలు విడుదలకు ఆదేశాలు ఇచ్చామని, అరు లక్షల కోట్లు భరిస్తున్నామని తెలిపారు.

బండి సంజయ్ కి నేతన్న దీక్ష చేసే హక్కు లేదు

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి చేనేత బోర్డును రద్దు చేసిందని ఆరోపించారు పొన్నం ప్రభాకర్. చేనేతకు చేయుత ఇవ్వాల్సింది పోయి బోర్డు రద్దు చేసి ఇప్పుడు సిరిసిల్ల లో ఆపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిగ్గు లేకుండా నేతన్న దీక్ష చేస్తానని ప్రకటించాడని తెలిపారు.

దీక్ష చేస్తానంటున్న బండి సంజయ్ తమిళనాడు కు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది.. తెలంగాణను ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 10న అందుకు సంబంధించిన అన్ని వివరాలు ఇస్తానని తెలిపారు. మెగా టెక్స్ టైల్ పార్క్ వరంగల్ కి ఇచ్చి, నేత కార్మికులు ఎక్కువ ఉన్న సిరిసిల్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

సిరిసిల్ల నేతన్నలకు చిప్ప చేతికిచ్చి మెగా టెక్స్ టైల్ పార్క్ ను వినోద్ కుమార్ వరంగల్ కు తరలిచుకపోతే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని విమర్శించారు. నేతన్నలకు 350 బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఒక్కటైన కేసిఆర్ నెరవేర్చాడా అని ప్రశ్నించారు.

అంత్యోదయ కార్డులు రద్దు చేసింది కేటీఆర్ కదా అని ప్రశ్నించారు. బిజెపి రాముని ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగే పరిస్థితి ఉందన్నారు. నేతన్నలు ఆ రెండు పార్టీల ట్రాప్ లో పడవద్దని కోరారు. నేతన్నల ప్రయోజనాల కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. నేతన్నల సమస్యలు వినడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.

ఒక్క మెగా క్లస్టర్ తీసుకొచ్చే సోయి లేకుండా ఆ రెండు పార్టీలు వ్యవహరించాయని విమర్శించారు. కరెంటు సబ్సిడీ ఇస్తూ బిసి కార్పొరేషన్ లో లోన్లు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నేతన్నలు, గీతన్నలు ఒక్కటేనని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చి మా ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. అధికారులు ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే ప్రజల ముందు నిలదీస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మనది ప్రజల ప్రభుత్వం, ఎవరు నిరాశ చెందవద్దని కోరారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

WhatsApp channel