Lok Sabha election Phase 6: ముగిసిన ఆరో విడత ఎన్నికలు; పశ్చిమ బెంగాల్లో 77.99 శాతం పోలింగ్
2024 లోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం విజయవంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్ లో చెదురుముదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరో దశలో 8 రాష్ట్రాల్లోని 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్నవారికి కూడా ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఆరో దశ లోక్ సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 77.99 శాతం పోలింగ్ నమోదైంది. తమ్లుక్, కాంతి, ఘటాల్, ఝార్గ్రామ్, మేదినిపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా బిష్ణుపూర్ లో 81.47 శాతం, తమ్లుక్ లో 79.79 శాతం, ఝార్గామ్ లో 79.68 శాతం, ఘటాలలో 78.92 శాతం, మేదినీపూర్లో 77.57 శాతం, బంకురాలో 76.79 శాతం, కంఠిలో 7.7 శాతం పోలింగ్ నమోదైంది. పురూలియా నియోజకవర్గంలో అత్యల్పంగా 74.09 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 15,600 పోలింగ్ కేంద్రాల్లో 73,63,273 మంది పురుషులు, 71,70,822 మంది మహిళలు, 133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 1,45,34,228 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
58 నియోజకవర్గాల్లో పోలింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆరో విడతలో 58 లోక్‌సభ స్థానాలకు మొత్తం 889 మంది అభ్యర్థుల పోటీ చేస్తున్నారు. ఇందులో ఢిల్లీ 7, హర్యానా 10, యూపీ 14, పశ్చిమబెంగాల్ 8, బిహార్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూకశ్మీర్‌లో 1 స్థానానికి పోలింగ్ జరిగింది. మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఆరో దశలోనే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీ, హర్యానాలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా)తో పాటు మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్) ఉన్నారు.