Congress Telangana Manifesto 2024 : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలో ‘ఐదు న్యాయాలు’(Congress 5 Nyay) పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక హామీలను ఇస్తూ అనుబంధ మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం… కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM), హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపింది.