BJP Telangana : తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఫిక్స్...! ఈ ఎంపీ స్థానాలపై భారీగా ఆశలు-bjp has high hopes on these mp positions in telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Telangana : తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఫిక్స్...! ఈ ఎంపీ స్థానాలపై భారీగా ఆశలు

BJP Telangana : తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఫిక్స్...! ఈ ఎంపీ స్థానాలపై భారీగా ఆశలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 17, 2024 02:23 PM IST

Loksabha Polls 2024 : ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను ఆశిస్తోంది బీజేపీ(BJP) అధినాయకత్వం. గత ఎన్నికల్లో 4 స్థానాలు సాధించి సంచలనం సృష్టించిన ఆ పార్టీ…. ఈసారి రెండంకెల సంఖ్యను దాటాలని చూస్తోంది.

పార్లమెంట్ ఎన్నికలు - 2024
పార్లమెంట్ ఎన్నికలు - 2024

Loksabha Polls in Telangana 2024: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో…. గత కొద్దిరోజులుగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. పదేళ్ల నుంచి తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్(BRS)…. ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైంది. కీలకమైన ఎన్నికల వేళ చాలా మంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. మరోవైపు బీజేపీ(BJP Telangana) ఈసారి మెజార్టీ సీట్లలో పాగా వేయాలని చూస్తోంది. కాంగ్రెస్ కూడా ఇదే లక్ష్యంతో ఉండటంతో ఈసారి ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.

మెజార్టీ సీట్లపై బీజేపీ కన్ను…!

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అడ్డాగా చెప్పుకునే కరీంనగర్, నిజాామాబాద్ లో బీజేపీ విక్టరీ కొట్టింది. వీటితో పాటు ఆదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఆయా స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ…. ఏకంగా నాలుగు స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో…. తెలంగాణపై భారీగా ఆశలు పెట్టుకుంటూ వస్తోంది కాషాయదళం. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ(GHMC )లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి… ప్రధాన పార్టీలకు గట్టి సవాల్ విసిరింది. ఓ దశలో తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితికి వచ్చింది. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  మెజార్టీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నప్పటికీ….. కేవలం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తర తెలంగాణలోని పలు స్థానాల్లో జెండాను ఎగరవేసింది. ఇక హైదరాబాద్ పరిధిలో మాత్రం రాజాసింగ్ మాత్రమే గెలిచారు. ఇక దక్షిణ తెలంగాణలో డీలా పడిపోయింది.

ఎంపీ సీట్లపై కన్ను….

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన సీట్లు దక్కకపోయినప్పటికీ… పార్లమెంట్ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది బీజేపీ. ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ కు చెందిన చాలా మంది నేతలను పార్టీలోకి తీసుకుంది. ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పోటీ చేసే వారిలో కీలకమైన నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలవగా… ఈసారి మాత్రం రెండంకెల సంఖ్యను దాటడమే టార్గెట్ గా పెట్టుకుంది. మోదీ (Modi)మోనియాతో పాటు పలు కీలకమైన ఆంశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రచారం సాగిస్తోంది తెలంగాణలోని బీజేపీ నాయకత్వం. అయితే ఈసారి కొన్ని స్థానాల విషయంలో భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ఎలాగైనా జెండా ఎగరవేయాలని చూస్తోంది. ఇందులో మాల్కాజ్ గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, చేవెళ్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్ తో పాటు వరంగల్, చేవెళ్ల స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో పార్టీకి చెందిన కీలక నేతలు పోటీ చేస్తున్నారు. మల్కాజ్ గిరి నుంచి ఈటల, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మెదక్ నుంచి రఘనందన్, నిజామాబాద్ నుంచి అర్వింద్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, కరీంనగర్ నుంచి సంజయ్ ఉన్నారు. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు.  హైదరాబాద్ తో పాటు మిగిలిన స్థానాల్లోనూ బీజేపీ గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో పదికి పైగా ఎంపీ స్థానాలను గెలిచి… తెలంగాణలోనూ తిరుగులేని శక్తిగా మారాలని కమలదళం పావులు కదుపుతోంది. ఆ దిశగా గ్రౌండ్ లోనూ కష్డపడుతోంది. త్వరలోనే మోదీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు… ప్రచారానికి రానున్నారు. 

ఇప్పటికే ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ… ఈసారి అక్కడ మళ్లీ ఖాతా తెరిచే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంస్థానాల్లో కొన్నింటిని గెలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఈసారి సౌత్ లో బీజేపీ బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తుది ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి…!

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు :

 • ఈటల రాజేందర్- మల్కాజిగిరి
 • అరవింద్ ధర్మపురి- నిజామాబాద్
 • బండి సంజయ్- కరీంనగర్
 • బీబీ పాటిల్- జహీరాబాద్
 • కిషన్ రెడ్డి- సికింద్రాబాద్
 • కొండా విశ్వేశ్వర్ రెడ్డి- చేవెళ్ల
 • మాధవి లత- హైద్రాబాద్
 • పోతుగంటి భరత్ - నాగర్ కర్నూల్
 • బూర నర్సయ్య గౌడ్- భువనగిరి
 • మహబూబ్ నగర్ - డీకే అరుణ
 • నల్గొండ - సైదిరెడ్డి
 • ఆదిలాబాద్ - గోడెం నగేశ్
 • వరంగల్ - ఆరూరి రమేశ్
 • పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్
 • ఖమ్మం - తాండ్ర వినోద్‌రావు
 • మహబూబాబాద్ - సీతారామ్ నాయక్

WhatsApp channel