Bandi Sanjay: ఆ రెండు పార్టీలకు శ్రీరాముడి పేరు వింటేనే వణుకు పుడుతోందన్న ఎంపీ బండి సంజయ్…-bandi sanjay said that those two parties are trembling on hearing the name of sri ram ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay: ఆ రెండు పార్టీలకు శ్రీరాముడి పేరు వింటేనే వణుకు పుడుతోందన్న ఎంపీ బండి సంజయ్…

Bandi Sanjay: ఆ రెండు పార్టీలకు శ్రీరాముడి పేరు వింటేనే వణుకు పుడుతోందన్న ఎంపీ బండి సంజయ్…

HT Telugu Desk HT Telugu
Apr 19, 2024 09:35 AM IST

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు శ్రీరాముడి పేరు చెబితేనే భయపడిపోతున్నారని బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.

రాముడి పేరు చెబితే రెండు పార్టీలు వణుకుతున్నాయన్న బండి సంజయ్
రాముడి పేరు చెబితే రెండు పార్టీలు వణుకుతున్నాయన్న బండి సంజయ్

Bandi Sanjay: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR ఏకంగా రాముడిని మొక్కే బీజేపీ BJPని తొక్కాలని అంటున్నారు… అంటే రాముడి భక్తులను తొక్కుతానంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రజల్ని బండి సంజయ్ ప్రశ్నించారు.

కాంగ్రెసోళ్లు Congress కూడా రాముడి పేరు వింటే వణికిపోతున్నారని తెలిపారు. బీజేపీ బరాబర్ రాముడి పేరుతో ప్రజల్లోకి వెళతాం.. కాంగ్రెస్ కు చేతనైతే బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలని సూచించారు.

కరీంనగర్ karimanagar పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొడిమ్యాల మండలంలో బండి సంజయ్ సమక్షంలో గౌరపూర్, దమ్మయ్యపేట, కొడిమ్యాల, నాచుపల్లి, హిమ్మత్ నగర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు.

కరీంనగర్ లో రూ.12 వేల కోట్లతో అభివృద్ది చేసినా... కొంతమంది అడ్డగోలుగా మొరుగుతున్నారని సంజయ్ విమర్శించారు. వాళ్ల తీరును చూసి ప్రజలు చీదరించుకుంటున్నారనే విషయాన్ని గుర్తించకపోవడం వాళ్ల మూర్ఖత్వమన్నారు.

పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలు రావడంతో ఇప్పుడు ఓటేయండి… ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్ అని బండి సంజయ్ మండిపడ్డారు.

‘‘రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేనోడు… తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనలేనోడు.. ఏకంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మేదెవరని ప్రశ్నించారు.

ఇండ్లు లేని పేదలకు ఇండ్ల జాగాతోపాటు రూ.5 లక్షల ఆర్దిక సాయం చేస్తామని, మహిళలకు నెలనెలా రూ.2,500లు అకౌంట్లో జమ చేస్తామని, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, వృద్దులు, వికలాంగులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని నమ్మించి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

6 గ్యారంటీలపై నిలదీయాల్సిన బీఆర్ఎస్ పార్టీ నేతలు… తాము చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ తో కుమ్మక్కయారని విమర్శించారు. అందులో భాగంగానే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెబుతుంటే… 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సీఎం చెబుతూ… 6 గ్యారంటీలపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారి మళ్లించే కుట్రకు తెరదీశారని ఆరోపించారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండో స్థానం కోసం పోటిపడుతున్నాయి.

కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నయని స్పష్టం చేశారు బండి సంజయ్. ప్రభుత్వ, ప్రైవేటు, మీడియా సంస్థలు సహా ఏ సర్వే చూసినా బీజేపీ బంపర్ మెజారిటీతో గెలవబోతోందని చెబుతున్నయని తెలిపారు.

బీజేపీకి ఆ రెండు పార్టీలు దరిదాపుల్లో కూడా లేవన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిని మీరెప్పుడైనా చూశారా? మీకెప్పుడైనా కలిశారా? బీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నడైనా మిమ్ముల్ని కలిశారా? అని బండి సంజయ్ ప్రజల్ని ప్రశ్నించారు. తనకు తాను స్వయం ప్రకటిత మేధావిగా చెప్పుకునే బిఆర్ఎస్ అభ్యర్థిని సొంత పార్టీ కార్యకర్తలే పట్టించకోవడం లేదన్నారు.

కార్యకర్తలు, నాయకులను కూడా గుర్తు పట్టలేని మేధావని ఎద్దేవ చేశారు. ఆ రెండు పార్టీల నేతలు ఒక్కటై... వ్యాపారాలు చేసుకుంటారని ఎన్నికలప్పుడే మీ వద్దకు వస్తారని విమర్శించారు. పైసలు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటారే తప్ప ఏనాడైనా దళితులు, బీసీలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడారా? ఎన్నడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు పోయారా? ఏనాడైనా పాదయాత్ర, ప్రజాహిత యాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుని ఆస్తులు సంపాదించుకోవడం, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల ద్రుష్టిని మళ్లించుకోవడం తప్ప వాళ్ళు చేసిందేమిలేదన్నారు. ఈ దేశం బాగుపడాలంటే… పేదల బతుకులు మారాలంటే, దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలంటే నరేంద్రమోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా)

WhatsApp channel

సంబంధిత కథనం