Lok sabha elections 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై యోగేంద్ర యాదవ్ జోస్యం; అది అసాధ్యమని వ్యాఖ్య
Lok sabha elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల ఫలితాల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ తన అంచనాలను వెల్లడించారు. ఇప్పటికే 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యవహారాల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ తన అంచనాను వెల్లడించిన విషయం తెలిసిందే.

Lok sabha elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ 272 సీట్లకు మించి సీట్లను గెలిచే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల ఫలితాల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ జోస్యం చెప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్ 100కు పైగా లోక్ సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుచుకోవడం అసాధ్యమన్నారు. బీజేపీకి 295 నుంచి 315 సీట్లు వస్తాయని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఇయాన్ బ్రెమ్మర్ కూడా ఇటీవల చెప్పారు.
మళ్లీ మోదీ సర్కారే..
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) స్పష్టమైన విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, అమెరికా ఎన్నికల నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ జోస్యం చెప్పిన నేపథ్యంలో యోగేంద్ర యాదవ్ కూడా అదే దిశలో తన అంచనా వెలిబుచ్చడం విశేషం. బీజేపీకి 240-260 సీట్లు, ఎన్డీయే మిత్రపక్షాలకు 35-45 సీట్లు, కాంగ్రెస్ కు 85-100 సీట్లు వచ్చే అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ లోక్ సభ ఐదో దశ పోలింగ్ తర్వాత ఓ వీడియోలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు 120 నుంచి 135 లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నారు.
ప్రశాంత్ కిశోర్ పై విమర్శలు
ఇదిలావుండగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా జోస్యం చెప్పినందుకు సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections 2024) బీజేపీకి 240 నుంచి 260 సీట్లు, ఎన్డీఏ మిత్రపక్షాలకు 34 నుంచి 45 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. ఎన్డీయేకు 275-305 సీట్లు వస్తాయన్నారు. అధికార పార్టీపై, ప్రధాని నరేంద్ర మోదీపై చెప్పుకోదగ్గ అసంతృప్తి లేనందున బీజేపీ సునాయాసంగా మెజారిటీ మార్కును దాటుతుందని ప్రశాంత్ కిశోర్ ఈ వారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
కాంగ్రెస్ 100 మార్క్ దాటుతుంది
కాంగ్రెస్ 85 నుంచి 100 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కాకుండా, బీజేపీ జోరును అడ్డుకోవాలని భావిస్తున్న ఇండియా కూటమిలోని ఇతర మిత్రపక్షాలు 120-135 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో 'మోదీ వేవ్'తో బీజేపీ 303 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవాలంటే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఘన విజయం సాధించాలి.