TS Elections : రేపు, ఎల్లుండి అన్ని విద్యాసంస్థలకు సెలవులు-హైదరాబాద్ కలెక్టర్ ప్రకటన-hyderabad news in telugu november 29 30th schools colleges holidays due elections ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Hyderabad News In Telugu November 29, 30th Schools Colleges Holidays Due Elections

TS Elections : రేపు, ఎల్లుండి అన్ని విద్యాసంస్థలకు సెలవులు-హైదరాబాద్ కలెక్టర్ ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Nov 28, 2023 01:32 PM IST

TS Elections : తెలంగా ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో రెండ్రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

విద్యాసంస్థలకు సెలవులు
విద్యాసంస్థలకు సెలవులు

TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు(నవంబర్ 29, 30) పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సాయంత్రం తర్వాత పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నికల పోలింగ్ ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తారు. కాబట్టి విద్యాసంస్థలు పోలింగ్ కు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 29, 30 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 1న తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కాలేజీ స్టూడెంట్స్ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. కొత్త ఓటు హక్కు పొందిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇతర జిల్లాల్లో

రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్‌ జరుగనున్నందున, ఆ రోజుతో పాటు ముందురోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.06 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్‌ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ముందు రోజు మధ్యాహ్నమే చేరుకుంటారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 29, 30న సెలవులు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పాలనాధికారులు ప్రకటనలు వెలువడనున్నాయి.

దీంతో ఈ నెల 29, 30 తేదీల్లో బడులకు సెలవులని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ జరిగే 30వ తేదీన అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సెలవు ప్రకటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని గతంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

సాయంత్రంతో ప్రచారానికి తెర

ఇవాళ సాయంత్రంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈసారి ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా, 45 వేల మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తు్న్నారు. మంగళవారం సాయంత్రం నుంచి సోషల్‌ మీడియాలోనూ రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని ఈసీ తెలిపింది.

WhatsApp channel