Sonia Gandhi : మీ కలల్ని సాకారం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి-తెలంగాణ ప్రజలనుద్దేశించి సోనియా గాంధీ సందేశం
Sonia Gandhi : ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలనుద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణ మార్చుకుందామన్నారు.మార్పుకోసం కాంగ్రెస్ ఓటు వేయాలని కోరారు.
Sonia Gandhi : మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఈ కాస్త సమయాన్ని సైతం సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
"ప్రియమైన సోదర సోదరీమణులారా! నేను మీ దగ్గరకు రాలేకపోతున్న..కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉన్నారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్న..తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవ్వడం చూడాలనుకుంటున్నాను. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలి. మీ కలలు సహకారం అవ్వాలి. మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ ,అభిమానాలకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు,అమ్మలు, బిడ్డలకు నా విన్నపం... మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయండి. మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి" -సోనియా గాంధీ
తెలంగాణ కోసం అమరులైన బిడ్డల స్వప్నం సాకారం అయితే చూడాలని ఉందని సోనియా గాంధీ అన్నారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకుందామన్నారు. మీ కలల్ని సాకారం చేసే, నిజాయితీగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుందామన్నారు. తనను అమ్మా అని పిలిచే తెలంగాణ బిడ్డల ప్రేమ, ఆప్యాయతలకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటానన్నారు. ఎప్పటికీ అంకితభావంతో ఉంటానన్నారు. ఈ ఎన్నికల్లో మీ సర్వశక్తులూ ఒడ్డి మార్పుకోసం ఓటు వేయండన్నారు.