Janasena Nagababu: నాగబాబుకు నిరాశే... పొత్తుల్లో పోటీకి దూరం… కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటన-disappointment for pawan kalyan brother nagababu lost chance in alliances ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Nagababu: నాగబాబుకు నిరాశే... పొత్తుల్లో పోటీకి దూరం… కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటన

Janasena Nagababu: నాగబాబుకు నిరాశే... పొత్తుల్లో పోటీకి దూరం… కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటన

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:32 AM IST

Janasena Nagababu: ఎన్నికల పొత్తుల్లో జనసేన ముఖ్య నాయకుడు నాగబాబు అభ్యర్ధిత్వం గల్లంతైంది. పొత్తుల్లో త్యాగాలు చేయాల్సి వచ్చిందని పవన్ ప్రకటించారు.

ఎన్నికల పొత్తుల్లో త్యాగాలు తప్పలేదన్న పవన్ కళ్యాణ్
ఎన్నికల పొత్తుల్లో త్యాగాలు తప్పలేదన్న పవన్ కళ్యాణ్

Janasena Nagababu: ఎన్నికల Alliance పొత్తుల్లో జనసేన పరిమితమైన స్థానాల్లో పోటీ చేయాల్సి రావడంతో పవన్ కళ్యాణ్‌ సోదరుడు నటుడు నాగబాబు కూడా అవకాశం కోల్పోయారు. నాగబాబు లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించినా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేపీ-టీడీపీ కూటమితో జట్టు కట్టడంతో త్యాగాలు తప్పలేదని పవన్ కళ్యాణ్ Pawan Kalyan ప్రకటించారు.

ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడంపై నాగబాబు ‍Nagababu కూడా స్పందించారు. జన సైనికుడిగా పని చేయడం కన్నా గొప్ప పదవి మరొకటి లేదన్నారు. జనసేన పార్టీలో జన సైనికుడిగా పని చేయడం కన్నా గొప్ప పదవీ, గౌరవం మరొకటి లేదని జనసేన నాగబాబు స్పష్టం చేశారు.

"వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంతో గడపాల్సిన విలువైన సమయాన్ని, సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆస్తులను కూడా ప్రజల కోసం త్యాగం చేసే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని, పవన్ నాయకత్వంలో జనసేన పార్టీ కోసం పని చేయడం ఓ అదృష్టమని చెప్పారు.

పవన్‌ లాంటి గొప్ప నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని గౌరవించడం, గెలిపించడం జనసైనికుడిగా తన కర్తవ్యమని తమ సమస్యలను ప్రజల సమస్యలుగా భావించే నాయకులు చాలా మంది ఉన్నారని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అరుదని చెప్పారు.

ఎంతో మంది జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కూడా పదవుల కోసం కాకుండా నాయకుడి ఆశయం కోసం నిలబడే వారు జనసేనలో లక్షల్లో ఉన్నారని, అలా పార్టీ కోసం, నాయకుడి ఆశయాల కోసం పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ జనసేనలో విశిష్టమైన గౌరవం ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రజల క్షేమం కోసం త్యాగాలు తప్పలేదు

ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ప్రజల సంక్షేమం కోసం త్యాగాలు చేయక తప్పలేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విదుర నీతి ప్రకారం ఒక రాజ్యం క్షేమం కోసం ఒక గ్రామం పోయినా ఫర్వాలేదని అంటారని ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం ఎన్నికల్లో పోటీ చేసే సీట్లు కొన్ని త్యాగం చేయక తప్పలేదని వివరణ ఇచ్చారు.

రాష్ట్రం బాగుండాలనే తపనతోనే త్యాగం చేశానని పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో వెల్లడించారు. 2019లో ఎంతోమంది యువతకు youth అవకాశం ఇచ్చామని, ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులో భాగంగా కొందరికి అవకాశం ఇవ్వలేకపోతున్నట్టు చెప్పారు.

సొంత అన్నయ్య నాగబాబుకు కేటాయించిన సీటు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళల ఆవేదన తనకు తెలుసన్నారు. తన బలం, బలహీనత ఏమిటో పూర్తి అవగాహన ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గడం చాలా అవసరమని తగ్గిన వాడు ఎప్పుడు నాశనం అవ్వడని, తగ్గే కొద్ది ఎదుగుతాం తప్ప ఏ అనర్ధం ఉండదని చెప్పారు. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని చిన్నప్పుడే చదువుకున్నానని కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

టీడీపీ-జనసేన పొత్తులో 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని మొదట భావించింది. ఆ తర్వాత కూటమిలోకి బీజేపీ రావడంతో జనసేన మూడు సీట్లను తగ్గించుకుని 21 స్థానాలకు పరిమితం అయ్యింది.

కొద్ది రోజుల క్రితం నాగబాబు ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు మళ్లీ ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఫిర్యాదు చేసింది. నాగబాబు కుటుంబ సభ్యులు స్థానికంగా నివాసం లేకుండా వడ్డేశ్వరంలో ఓట్ల కోసం దరఖాస్తు చేశారని ఫిర్యాదు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం