Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా వేల రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇదే సమయంలో పలువురు నేతలు తమకు కలిసొచ్చే పార్టీలకు ఫిరాయిస్తున్నరు.తాజాగా క్యు న్యూస్ వ్యవస్థాపకుడు,జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే సమక్షంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు.
గత కొంత కాలంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతూ వస్తుంది.తాజాగా ఆ ప్రచారానికి తెర దింపుతూ మంగళవారం అయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.అయితే గతంలో మల్లన్న బీజేపీలో చేరి అనంతరం బయటికి వచ్చారు.మార్నింగ్ న్యూస్ ద్వారా అయన గ్రామాల్లో ప్రజలకు మరింత దగ్గరయ్యారు.ప్రభుత్వం వైఫల్యాలపై తనదైన స్టైల్ లో విరుచుకూ పడుతూ ఉంటారు.ఆయనపై అనేక పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చారు మల్లన్న.
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలు,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఅర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి మల్లన్న మద్దతు తెలుపుతూ ఉండడంతో కాంగ్రెస్ నేతలు అతనితో చర్చలు జరిపారు.ఆ చర్చలు సఫలం కావడంతో అయన కాంగ్రెస్ లో చేరారు.ఇటు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తీన్మార్ మల్లన్న తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన సంగతి తెలిసిందే.