Election results : ‘మహా’లో ఎన్డీఏ కూటమి హవా- ఝార్ఖండ్‌లో బిగ్ ‘ట్విస్ట్’!
Maharashtra Election results 2024 live updates : మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ దూసుకెళుతోంది. కానీ ఝార్ఖండ్‌లో అతి పెద్ద ట్విస్ట్ ఎదురైంది!
దేశంలో మరో కీలక ఘట్టం! మచ్ అవైటెడ్ మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. వీటితో పాటు 13 రాష్ట్రాల్లో జరిగిన 13 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌సభ సీట్లకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. వీటిల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్ సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్రలో ఇలా..
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. ఇక్కడ అధికార మహాయుతీ, విపక్ష మహావికాస్ ఆఘాడీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. దాదాపు అన్ని పార్టీలు పరువు, అస్తిత్వం కోసం పోటీ చేసిన ఈ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
పలు ఎగ్జిట్ పోల్స్ మహాయుతికి ఎడ్జ్ ఇవ్వగా, ఇంకొన్ని మాత్రం మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఫలితాల రోజు కోసం రెడీ అయ్యాయి. ముంబైలోని వివిధ హోటల్స్‌లో బుకింగ్స్ జోరుగా సాగాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు మహా వికాస్ ఆఘాడీ టీమ్ ఫ్లైట్ టికెట్స్‌ని కూడా బుక్ చేసింది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది. ఆ లోపు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అలా కాని పక్షంలో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు మరింత హైప్ యాడ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ ఊహాగానాలకు చెక్ పడిందనే చెప్పుకోవాలి.
ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 200కుపైగా సీట్లల్లో లీడింగ్‌లో ఉంది. విపక్ష ఇండియా కూటమి (మహా వికాస్ ఆఘాడీ) 69 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇతరులు ఆరు చోట్ల ముందున్నారు.
ఝార్ఖండ్‌లో ఇలా..
ఝార్ఖండ్‌లో 82 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 40 మెజారిటీ మార్క్ దాటాలి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి జేఎంఎం, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది.
ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 30 చోట్ల లీడింగ్‌లో ఉంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి 49 చోట్ల ముందుంది.
వాస్తవానికి ఉదయం నుంచి ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా జేఎంఎం ముందంజలోకి వచ్చి అందరికి షాక్ ఇచ్చింది.
లీడింగ్‌లో ప్రియాంక గాంధీ..
ఉదయం 10:30 గంటల సమయానికి.. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ 1లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో లీడింగ్‌లో ఉన్నారు.
సంబంధిత కథనం