Jammu Kashmir elections : హై సెక్యూరిటీ మధ్య జమ్ముకశ్మీర్​లో చివరి దశ పోలింగ్​ షురూ..-jammu kashmir elections phase 3 polling begins amid high security ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Jammu Kashmir Elections : హై సెక్యూరిటీ మధ్య జమ్ముకశ్మీర్​లో చివరి దశ పోలింగ్​ షురూ..

Jammu Kashmir elections : హై సెక్యూరిటీ మధ్య జమ్ముకశ్మీర్​లో చివరి దశ పోలింగ్​ షురూ..

Sharath Chitturi HT Telugu
Oct 01, 2024 07:10 AM IST

Jammu Kashmir elections 2024 : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 40 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్​ 8న ఫలితాలు వెలువడతాయి.

ఈవీఎంలతో పోలింగ్​ అధికారులు..
ఈవీఎంలతో పోలింగ్​ అధికారులు.. (Aman Sharma)

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్​ ప్రక్రియ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ దఫా పోలింగ్​లో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జమ్ముకశ్మీర్​ ఎన్నికలు 2024..

చివరి దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం నాటికి ముగిసింది. ఇక మూడో దశ పోలింగ్ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రపాలిత ప్రాంతం అంతటా భద్రతా బలగాలను మోహరించారు.

మొత్తం 40 నియోజకవర్గాల్లో 24 జమ్ము డివిజన్ పరిధిలోకి రాగా, మిగిలినవి కశ్మీర్​లో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ చివరి దశ ఎన్నికల్లో మంగళవారం 3.9 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 5,060 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

2024 జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తుండగా.. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వంటి మరో రెండు ప్రధాన పార్టీలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

ఉధంపూర్, బారాముల్లా, కథువా, కుప్వారా ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్), క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ)లను మోహరించారు. ఉగ్రవాద రహితంగా, ప్రశాంతంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్ము జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు.

జమ్ము డివిజన్​లో అత్యధికంగా 11 సెగ్మెంట్లు ఉన్నాయి (బిష్ణా-ఎస్సీ, సుచేత్​గఢ్-ఎస్సీ, ఆర్ఎస్ పురా, జమ్ము సౌత్, బహు, జమ్ము ఈస్ట్, నగ్రోటా, జమ్ము వెస్ట్, జమ్ము నార్త్, అఖ్నూర్-ఎస్సీ, చాంబ్), కథువా జిల్లాలో ఆరు స్థానాలు (బని, బిల్లావర్, బసోహ్లి, జస్రోటా, కథువా-ఎస్సీ, హీరానగర్), ఉధంపూర్ జిల్లాలో నాలుగు స్థానాలు (ఉధంపూర్ పశ్చిమం, ఉధంపూర్- ఉధంపూర్- పశ్చిమం). సాంబాలో మూడు సెగ్మెంట్​లు (సాంబా- రామ్​గఢ్​ ఎస్​సీ- విజయపూర్) ఉన్నాయి.

కశ్మీర్ డివిజన్​లో కర్నా, ట్రెఘమ్, కుప్వారా, లోలాబ్, హంద్వారా, లంగేట్ సహా 16 అసెంబ్లీ నియోజకవర్గాలు కుప్వారా జిల్లాలోని సోపోర్, రఫియాబాద్, ఉరీ, బారాముల్లా, గుల్మార్గ్, వాగూరా-క్రేరీ, పటాన్, బందిపోరా జిల్లాలోని సోనావారి, బండిపోరా, గురేజ్ (ఎస్టీ) ఉన్నాయి.

పోటీలో కీలక అభ్యర్థులు..

పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్, మాజీ మంత్రి సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్​లు ఈ దఫా ఎన్నికల బరిలో ఉన్నారు. లోన్ కుప్వారా నుంచి రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా, సింగ్ ఉధంపూర్​లోని చెనాని స్థానం నుంచి బరిలో దిగారు.

జమ్ముకశ్మీర్ మాజీ మంత్రులు రమణ్ భల్లా (ఆర్ఎస్ పురా), ఉస్మాన్ మజీద్ (బందిపోరా), నజీర్ అహ్మద్ ఖాన్ (గురేజ్), తాజ్ మొహియుద్దీన్ (ఉరీ), బషరత్ బుఖారీ (వాగూరా-క్రేరీ), ఇమ్రాన్ అన్సారీ (పటాన్), గులాం హసన్ మీర్ (గుల్మార్గ్), చౌదరి లాల్ సింగ్ (బసోహ్లీ).

జమ్ముకశ్మీర్​కి​ స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఓటు హక్కు పొందిన పాకిస్థాన్​న్ శరణార్థులు వాల్మీకి సమాజ్, గూర్ఖా కమ్యూనిటీలు ఈ ఎన్నికల్లో పాల్గొనడం ప్రధానాంశాల్లో ఒకటి.

జమ్ముకశ్మీర్ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 5న ఎగ్జిట్ పోల్స్, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంబంధిత కథనం