Delhi election results : దిల్లీ ఎన్నికల్లో బీజేపీ హవా- ఆప్​ పరిస్థితి ఇలా..-delhi election results live see who is winning the race aap vs bjp kejriwal pm modi news ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Delhi Election Results : దిల్లీ ఎన్నికల్లో బీజేపీ హవా- ఆప్​ పరిస్థితి ఇలా..

Delhi election results : దిల్లీ ఎన్నికల్లో బీజేపీ హవా- ఆప్​ పరిస్థితి ఇలా..

Sharath Chitturi HT Telugu
Updated Feb 08, 2025 08:46 AM IST

Delhi election results live : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్​ కాస్త వెనకపడింది. ఈ రెండింటికీ కాంగ్రెస్​ చాలా దూరంలో ఉంది! లేటెస్ట్​ అప్డేట్స్​ ఇలా..

దిల్లీలోని ఓ కౌంటింగ్​ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు ఇలా..
దిల్లీలోని ఓ కౌంటింగ్​ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు ఇలా..

దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం! శనివారం ఉదయం 8 గంటలకు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎర్లీ ట్రెండ్స్​లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆప్ మాత్రం వెనకపడింది.

దిల్లీ ఎన్నికల ఫలితాలు- ఎర్లీ ట్రెండ్స్​..

దిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్​ 36గా ఉంది. ఇక ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు ఉన్న డేటా ప్రకారం.. బీజేపీ 32 చోట్ల ముందంజలో ఉంది. అరవింద్​ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ 14 చోట్ల లీడింగ్​లో ఉంది.

మొదట్లో ఖాతా తెరవని కాంగ్రెస్​.. ఇప్పుడు 1 చోట లీడింగ్​లో ఉంది.

అంతేకాదు, ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్​ ప్రకారం దిల్లీ మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ వెనకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్​ ముందంజలో ఉన్నారు.

దిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్​ అప్డేట్స్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

కట్టుదిట్ట భద్రత మధ్య కౌంటింగ్​..

ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక 8న కౌంటింగ్​ కోసం ఈసీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్​ కోసం దిల్లీ వ్యాప్తంగా 19 కేంద్రాలను సిద్ధం చేసింది. 10వేలకుపైగా మంది పోలీసులు, ప్రతి కౌంటింగ్​ కేంద్రం వద్ద రెండు పాలమిలిటరీ దళాలు విధులు నిర్వహిస్తున్నాయి.

దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఆలిస్ వాజ్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కోసం శనివారం మొత్తం 5,000 మంది సిబ్బందిని, లెక్కింపు పర్యవేక్షకులు, లెక్కింపు సహాయకులు, మైక్రో పరిశీలకులను, ఈ ప్రక్రియకు శిక్షణ పొందిన సహాయక సిబ్బందిని మోహరించిన్నట్లు తెలిపారు.

2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా..

2020లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 70 సీట్లల్లో 62 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని తిరిగి కైవశం చేసుకుంది. బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్​ మాత్రం అసలు ఖాతానే తెరవలేదు. 2015 ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు.

ఈసారి పరిస్థితులు మారుతాయని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి! దేశ రాజధానిలో 26ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ చెప్పాయి.

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని అనేక ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 39-49, ఆప్​కి 21-31, కాంగ్రెస్​కి 0-1 సీట్లు వస్తాయని తేలింది.

బీజేపీకి 35-40 సీట్లు, ఆప్​కి 32-37 సీట్లు, కాంగ్రెస్​కి ఒక సీటు వస్తాయని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 51-60 సీట్లు, ఆప్​కి 10-19 సీట్లు, కాంగ్రెస్​కి 0 సీట్లు వస్తాయని తెలిపింది. పీపుల్స్ ఇన్​సైట్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 40-44 సీట్లు, ఆప్ కు 25-29 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు వస్తాయని తేలింది.

Whats_app_banner

సంబంధిత కథనం