YSRCP Candidates 2024 : వైసీపీ అభ్యర్థుల జాబితా 'సిద్ధం' - ఇవాళే ప్రకటించనున్న జగన్-ysrcp to release list of candidates for elections 2024 today ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Candidates 2024 : వైసీపీ అభ్యర్థుల జాబితా 'సిద్ధం' - ఇవాళే ప్రకటించనున్న జగన్

YSRCP Candidates 2024 : వైసీపీ అభ్యర్థుల జాబితా 'సిద్ధం' - ఇవాళే ప్రకటించనున్న జగన్

AP Elections 2024 Updates: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది వైసీపీ. ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నుంచి అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెల్లడించనున్నారు.

ఇవాళ వైసీపీ అభ్యర్థుల ప్రకటన (Photo From YSRCP Twitter)

YSRCP Candidates For Elections 2024: ఎన్నికల యుద్ధానికి(AP Elections 2024) సిద్ధమంటోంది వైసీపీ. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాపై తెగ కసరత్తు చేస్తూ వచ్చిన ఆ పార్టీ అధినాయకత్వం... మరోవైపు సిద్ధం పేరుతో నాలుగు భారీ సభలను నిర్వహించింది. ఈ సభలతోనే ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. కొద్దిరోజులుగా అభ్యర్థుల కూర్పుపై భారీగా కసరత్తు చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.... ఇవాళ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను(YSRCP Candidates) ప్రకటించనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల పూర్తి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. కడప జిల్లాలోని ఇడుపులపాయ వేదికగా పేర్లను ప్రకటించనున్నారు వైఎస్ జగన్.

ఇవాళ ఉదయమే వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సిద్ధం సభలతో కేడర్ జోష్ నింపే ప్రయత్నం చేసిన అధినాయకత్వం.... ఈనెల 18 నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. భారీ సభలతో పాటు జగన్ రోడ్ షోలు ఉండనున్నాయి.

పలు విడతలుగా ఇన్ ఛార్జ్ లను మార్చిన వైసీపీ 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇప్పటి వరకూ 76 స్థానాల్లో అసెంబ్లీ ఇన్ ఛార్జులు, 24 ఎంపీ స్థానాల్లో ఇన్ ఛార్జుల పేర్లు ఖరారు చేసింది. సిట్టింగ్ లను కాదని, ఇతర నియోజకవర్గ నేతలను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. మరోవైపు ఈ నెల 10 జరిగిన అద్దంకి సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల చేస్తారని ప్రచారం జరిగినా... అది వాయిదా పడింది. ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా పాటు మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

ఇవాళే ఎన్నికల షెడ్యూల్….

Lok Sabha election schedule : శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ వెలువడనుంది.లోక్​సభతో పాటు ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​తో పాటు.. ఆయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను కూడా ప్రకటించనుంది ఎన్నికల సంఘం.

లోక్​సభ సీట్లు:  లోక్​సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్​ నుంచి మే మధ్య వరకు పోలింగ్​ ప్రక్రియ సాగుతుంది. సాధారణంగా మే చివరి వారంలో ఫలితాలు వెలువడతాయి.

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు:- ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మెజారిటీ ఫిగర్​ 88ని దాటాలి. జగన్​ నేతృత్వంలోని వైసీపీ.. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుండగా… తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి.

ఇవాళ దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో ఎన్నికల సంఘం ప్రెస్​ మీటింగ్​ని ఏర్పాటు చేసింది. ఇందులోనే షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.