Clean Sweep Districts : ఏపీలో 'కూటమి' ప్రభంజనం - ఈ జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ...!-ycp did not win a single seat in these districts in ap assembly election results 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Clean Sweep Districts : ఏపీలో 'కూటమి' ప్రభంజనం - ఈ జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ...!

Clean Sweep Districts : ఏపీలో 'కూటమి' ప్రభంజనం - ఈ జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ...!

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Jun 04, 2024 03:32 PM IST

Andhra Pradesh Assembly Election Results 2024 : ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. చాలా జిల్లాల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Andhra Pradesh Assembly Election Results 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. అయితే మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ… ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఏకంగా ఎనిమిది జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు.

కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా వైసీపీ గెలవలేకపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత…. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్వీప్‌ చేయటం ఇదే తొలిసారి.

సీమలో దూసుకెళ్లిన సైకిల్….

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రాయలసీమలో మాత్రం ఫ్యాన్ హైస్పీడ్‌లో తిరిగింది. సీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో టీడీపీ కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవగా, ఉరవకొండలో కేశవ్ విజయం సాధించారు. హిందూపురంలో బాలకృష్ణ గెలిచారు. మిగతా అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విక్టరీ కొట్టారు.

ఇక తాజా ఎన్నికల ఫలితాల్లో(2019)… తెలుగుదేశం పార్టీ సూపర్ విక్టరీ కొట్టే దిశగా వెళ్తొంది. సీమ జిల్లాల్లో ఉన్న 52 స్థానాల్లో మెజార్టీ సీట్లల్లో పాగా వేసే దిశగా వెళ్తోంది. వైసీపీ కేవలం 10- 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిగతా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే దూసుకెళ్తున్నారు.

గత ఫలితాలతో పోలిస్తే… ఈసారి రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా చాటింందని చెప్పొచ్చు. వైసీపీ అడ్డాగా చెప్పుకునే ఈ జిల్లాల్లో సైకిల్ దూసుకెళ్లటంతో…. కూటమి ప్రభంజనం ఖాయమైందని చెప్పొచ్చు.

ఈ సారి ఫలితాల్లో కూటమి ఏకంగా 155 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం ఉంది. వైసీపీ 15లోపు స్థానాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది.

 

Whats_app_banner