AP Postal Ballot : పోస్టల్‌ బ్యాలెట్లపై సీఈసీ క్లారిటీ - ఏపీ సీఈవోకు లేఖ, ఏం చెప్పిందంటే..?-withdrawal of orders issued by ap ec ceo on may 25 on postal ballot ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Postal Ballot : పోస్టల్‌ బ్యాలెట్లపై సీఈసీ క్లారిటీ - ఏపీ సీఈవోకు లేఖ, ఏం చెప్పిందంటే..?

AP Postal Ballot : పోస్టల్‌ బ్యాలెట్లపై సీఈసీ క్లారిటీ - ఏపీ సీఈవోకు లేఖ, ఏం చెప్పిందంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
May 30, 2024 10:02 PM IST

AP Postal Ballot :పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.అటెస్టేషన్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
ఏపీ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

AP Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ మీద ఏపీ ఎన్నికల సంఘం మే 25న జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరణ నేపథ్యంలో మే 25న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

గత ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సీఈసీ కార్యాలయం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ నియమించిన అధికారి సంతకం చేస్తే సరిపోతుందని వివరణ ఇచ్చింది. అటెస్టేషన్ అధికారి నియామకం RO ద్వారా చేసినందున స్పెసిమెన్ సంతకాల సేకరణ అవసరం లేదని స్పష్టం చేసింది.

గతంలో పోస్టల్ బ్యాలెట్ వేర్వేరు ప్రదేశాల్లో జరిగేది. ఈ ఏడాది ప్రతి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వేయడానికి EC ఏర్పాట్లు చేసింది. EC నియమించిన అధికారులే సంతకాలు చేసారు. హోదా రాయకున్న, స్టాంప్ వేయకున్నా అవి చెల్లుతాయి. ఈసీ వివరణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ మీద సందిగ్ధం తొలగిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావటంతో ఏపీ ఎన్నికల సంఘం మే 25న ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమో జారీ చేశారని ఈ పిటిషన్ లో ప్రస్తావించింది. సీఈవో జారీ చేసిన మెమోలు రద్దు చేయాలని కోరింది. దీనిపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.

WhatsApp channel