Sujana Safe Game: ఎన్నికల రేసులో సుజనా చౌదరి సేఫ్‌.. పోతిన మహేష్ ఔట్… వ్యూహాత్మకంగానే బెజవాడ పశ్చిమలో పోటీ…-untitled story ,elections న్యూస్

Sujana Safe Game: ఎన్నికల రేసులో సుజనా చౌదరి సేఫ్‌.. పోతిన మహేష్ ఔట్… వ్యూహాత్మకంగానే బెజవాడ పశ్చిమలో పోటీ…

Sarath chandra.B HT Telugu
Mar 28, 2024 06:43 AM IST

Sujana Safe Game: ఎన్నికల పొత్తులో భాగంగా జరిగిన అసెంబ్లీ టిక్కెట్ల రేసులో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయం సాధించారు. చివరి నిమిషంలో విజయవాడ తెరపైకి వచ్చిన సుజనా లోక్‌సభ వదులుకుని అసెంబ్లీకి రెడీ అయ్యారు.

విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్న సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్న సుజనా చౌదరి

Sujana Safe Game: టీడీపీలో హై ప్రొఫైల్ పొలిటిషియన్‌గా ముద్ర పడిన మాజీ కేంద్ర మంత్రి సుజనా Sujana chowdary చౌదరి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేస్తున్నారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రి central ministerగా పనిచేసి మళ్లీ అసెంబ్లీ Assemblyకి పోటీ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసినా చివరి సుజనా మాత్రం వ్యూహాత్మంగానే అడుగులు వేశారు.

ట్రెండింగ్ వార్తలు

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు Alliance లో భాగంగా విజయవాడ పశ్చిమ టిక్కెట్ బీజేపీకి దక్కడంతో ఆ స్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి దక్కించుకున్నారు. విజయవాడ వెస్ట్‌Vijayawada west టిక్కెట్ కోసం పోతిన మహేష్ Pothina Mahesh చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ జనసేన నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేసినా పొత్తులో దానిని వదులుకోక తప్పలేదు.

బీజేపీ Bjp తరపున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది. అందులో విజయవాడ పశ్చిమ టిక్కెట్ సుజనాకు కేటాయించడంతో సస్పెన్స్ వీడింది. ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిగామాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేయనున్నారు.విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో 1983 తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు.

2014లో టీడీపీతో కలిసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అప్పట్లో ఆయనకు టీడీపీ రెబల్స్ పోటీగా నిలవడంతో ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ రెబల్స్‌ను విరమింపచేసేందుకు స్వయంగా వెంకయ్య నాయుడు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 3వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి ఓటమి పాలయ్యాడు.

తాజా ఎన్నికల్లో సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ టిక్కెట్ కేటాయించారు. సుజనా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నా ఆయనకు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిలో టీడీపీ నాయకులుగా ఉన్న జలీల్‌ఖాన్‌, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వంటి వారితో సుజనా చౌదరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

పశ్చిమలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు పరిమితమే అయినా టీడీపీ ఓటు బ్యాంకు బలంగానే ఉంది. పాతబస్తీ పూర్తిగా వాణిజ్య ప్రాంతం కావడం బీజేపీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. జనసేన అభ్యర్థుల్ని సముదాయిస్తే గెలుపు పెద్ద సమస్య కాదనే భావన బీజేపీలో ఉంది. దీనికి తోడు విజయవాడ అర్బన్ ప్రాంతంలో రాజధాని అమరావతి ప్రభావం ఉంటుందని బీజేపీ-టీడీపీ నమ్ముతున్నాయి.

సుజనా కోసమే…

విజయవాడ సెంట్రల్, పశ్చిమ టిక్కెట్లలో ఏదొక స్థానం తమకు కేటాయించాలని బీజేపీ మొదటి నుంచి పట్టుబడుతోంది. గతంలో విజయవాడ తూర్పు నుంచి సినీ నటుడు కోట శ్రీనివాసరావు 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పాతికేళ్లుగా బీజేపీకి విజయవాడలో చోటు దక్కలేదు. దీంతో విజయవాడ కీలకమని బీజేపీ భావించింది.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల దిగుతున్న నేపథ్యంలో సుజనా కూడా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. విజయవాడ లోక్‌‌సభ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా దానిని వదులుకునేందుకు టీడీపీ సుముఖత చూపలేదు.

మరోవైపు పార్లమెంటుకు పోటీ చేయడం కంటే ఏపీలో ఉండటమే సేఫ్ అనే భావనలో సుజనా ఉన్నట్టు చెబుతున్నారు. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసినా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడమే మేలనే భావనలో సుజనా ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా మొదట పశ్చిమ సీటును జనసేన ఆశించింది. అందుకు టీడీపీ కూడా అంగీకరించింది. జనసేన తరపున పోతిన మహేష్‌ ప్రచారం కూడా ప్రారంభించారు. చివరి నిమిషంలో బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. చివరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో పోతిన మహేష్ వైఖరి ఎలా ఉంటందనే చర్చ జరుగుతోంది.

2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలో చేరిన సుజనా చౌదరి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. పొత్తులో విజయవాడ స్థానం బీజేపీకి కేటాయిస్తే.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం సాగింది. 2005లో టీడీపీలో చేరిన సుజనా 2010లో రాజ్యసభకు ఎంపికయ్యారు. రెండు దపాలు 12 ఏళ్ళ పాటు ఎంపీగా పనిచేశారు. మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యాక క్యాబినెట్‌లో చోటు దక్కింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా నాలుగేళ్లు పనిచేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం