CBN Campaign: రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నారు… ఎన్డీఏతోనే రాష్ట్రానికి ఆక్సిజన్ అంటున్న చంద్రబాబు-they are robbing rs 100 by giving rs 10 chandrababu says oxygen to the state with nda ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cbn Campaign: రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నారు… ఎన్డీఏతోనే రాష్ట్రానికి ఆక్సిజన్ అంటున్న చంద్రబాబు

CBN Campaign: రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నారు… ఎన్డీఏతోనే రాష్ట్రానికి ఆక్సిజన్ అంటున్న చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Apr 11, 2024 06:40 AM IST

CBN Campaign: వైసీపీ పాలనలో రాష్ట్రంలో బాగుపడింది నలుగురేనని, రాష్ట్రాన్ని పాలించేది విజయ సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జలరామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి అని...బాగుపడింది కూడా వారేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు.

కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్, పురందేశ్వరి
కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్, పురందేశ్వరి

CBN Campaign: రానున్న ఎన్నికలకు ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి సింగల్‌గా రావట్లేదని, శవాలతో వస్తున్నాడని TDP టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు Chandrababu ఎద్దేవా చేవారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలి...ఎన్డీయే పాలన రావాలని పిలుపునిచ్చారు. బుధవారం నిడదవోలు, తణుకులలో Pawan Kalyan పవన్ కళ్యాణ్‌, Purandeswari పురందేశ్వరితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఏన్డీయే NDA ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తుందని చంద్రబాబు చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తొలగిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రూ.10లు ఇచ్చి 100 దోచేది జగన్మోహన్ రెడ్డేనని ఆరోపించారు.

‘‘నిడదవోలు ప్రజల స్పందన చూస్తే.. గెలుపు డిసైడ్ అయిపోయిందని అనిపిస్తోందన్నారు . మూడు పార్టీల తరపున సింహ గర్జన మొదలైందని ప్రజాగళం వినిపిస్తామన్నారు. జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి నిడదవోలు ప్రజలు సిద్దంగా ఉన్నారని, కూటమిని అడ్డుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే తొక్కుకుంటూ పోతామన్నారు. 

కూటమి అభ్యర్ధులుగా రాజమండ్రి పార్లమెంటుకు పురందేశ్వరీ, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ లు నిలబడ్డారని, వారిని ఆశ్వీర్వదించాలని కోరారు. నిడదవోలులో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. 2014 కూటమిలో కంటే నేడు తక్కువ సీట్లతో బీజేపీ BJP పోటీ చేస్తోందని జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అన్నారు.

రాష్ట్రానికి మోదీ సహకారం అవసరం…

జగన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని, కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఆక్సిజన్‌లా బ్రతికిస్తుందన్నారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. రాజధాని కట్టుకోవాలి. ఇండస్ట్రియల్ కారిడార్లు పూర్తిచేసుకోవాలి. ఇవన్నీ నెరవేరాలంటే నరేంద్రమోడీ సహకారం అవసరం అని చంద్రబాబు చెప్పారు.

గాడితప్పిన పరిపాలనను దారిలో పెట్టే శక్తి, యుక్తి ఎన్డీఏ కూటమికి మెండుగా ఉంది. నరేండ్ర మోడి నాయకత్వాలో 2047 కి భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా నిలవబోతోంది. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థల్లో దేశం ఒకటో, రెండో స్థానాల్లో ఉండ బోతుందని అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూడా వెనకపబకూడదని దేశంతో పాటు రాష్ట్రం కూడా సూపర్ పవర్ గా ఎదగాలి. అందుకు మీరందరి సహకారం కావాలన్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్సీలే పారిపోతున్నారు

జగన్ రెడ్డిని చూసి అందరూ పారిపోతున్నారని ఆయన పార్టీ శాసనమండలి సభ్యులు నాలుగేళ్లు పదవీకాలం ఉన్నా బయటకు వస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.కు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంటూ మనతో కలుస్తున్నారని, ఎమ్మెల్సీ ఇక్బాల్, రామచంద్రయ్య, వంశీ లాంటి వారు బయటకు వచ్చారన్నారు.

రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెదిరెడ్డి లాంటి నలుగురు రెడ్లకు అప్పగించాడని మండిపడ్డారు. కూటమి అన్యోన్యంగా ముందుకు వెళుతుంటే జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడు. ఆ చిచ్చులో జగన్ రెడ్డే దగ్ధం అవుతాడు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాడు. జగన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ఓటుతో త్రిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు.

తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు

ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నానన్నారు.

సంబంధిత కథనం