AP Election Result 2024 : సీమలో దూసుకెళ్లిన 'సైకిల్ ' - అంచనాలకు మించి సూపర్ విక్టరీ...!
Rayalaseema Election Results 2024: ఏపీ ఎన్నికల ఫలితాల్లో సీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ సక్సెస్ అయింది. 2019లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచినప్పటికీ… ఈసారి అంచనాలన్నీ తారుమారు చేసింది.
Rayalaseema Election Results 2024: ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించే దిశగా వెళ్తోంది. 2019లో వైసీపీ సాధించిన విజయాన్ని మించి ఈ విజయం ఉండే అవకాశం ఉంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీమలో దూసుకెళ్లిన సైకిల్….
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రాయలసీమలో మాత్రం ఫ్యాన్ హైస్పీడ్‌లో తిరిగింది. సీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో టీడీపీ కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవగా, ఉరవకొండలో కేశవ్ విజయం సాధించారు. హిందూపురంలో బాలకృష్ణ గెలిచారు. మిగతా అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విక్టరీ కొట్టారు.
సీన్ రివర్స్ - సైకిల్ సూపర్ విక్టరీ….
ఇక తాజా ఎన్నికల ఫలితాల్లో(2019)… తెలుగుదేశం పార్టీ సూపర్ విక్టరీ కొట్టే దిశగా వెళ్తొంది. సీమ జిల్లాల్లో ఉన్న 52 స్థానాల్లో మెజార్టీ సీట్లల్లో పాగా వేసే దిశగా వెళ్తోంది. వైసీపీ కేవలం 10- 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిగతా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే దూసుకెళ్తున్నారు.
గత ఫలితాలతో పోలిస్తే… ఈసారి రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా చాటింందని చెప్పొచ్చు. వైసీపీ అడ్డాగా చెప్పుకునే ఈ జిల్లాల్లో సైకిల్ దూసుకెళ్లటంతో…. కూటమి ప్రభంజనం ఖాయమైందని చెప్పొచ్చు.