EC Suvidha Portal: ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చిన సువిధ పోర్టల్.. మూడొంతుల దరఖాస్తుల పరిష్కారం…-suvidha portal which brought transparency in the conduct of elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec Suvidha Portal: ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చిన సువిధ పోర్టల్.. మూడొంతుల దరఖాస్తుల పరిష్కారం…

EC Suvidha Portal: ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చిన సువిధ పోర్టల్.. మూడొంతుల దరఖాస్తుల పరిష్కారం…

Sarath chandra.B HT Telugu
Apr 08, 2024 06:00 AM IST

EC Suvidha Portal: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనావళి అమల్లోకి వచ్చిన 20 రోజుల వ్యవధిలోనే ఈసీ పోర్టల్‌‌కు భారీగా దరఖాస్తులు అందాయి. వాటిలో మూడొంతుల దరఖాస్తుల్ని ఎన్నికల సంఘం పరిష్కరించింది.

సువిధ యాప్‌లోనే ఎన్నికల ప్రచారానికి అనుమతులు
సువిధ యాప్‌లోనే ఎన్నికల ప్రచారానికి అనుమతులు

EC Suvidha Portal: ఎన్నికల Elections నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు ప్రజలు, పార్టీల నుంచి క్రమబద్దమైన ఎన్నికల ప్రచారాన్ని Campaign స్వీకరించేందుకు ఈసీ అందుబాటులోకి తెచ్చిన సువిధ Suvidha Portal పోర్టల్‌లో రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి ఇప్పటి వరకు 73,379 అనుమతి అభ్యర్థనలు, దరఖాస్తులు Applications అందినట్టు ఎన్నికల సంఘం ఏపీ సీఈఓ ప్రకటించారు. వాటిలో 44,626 అభ్యర్థనల్ని (60%) పరిష్కరించారు.

2024 ఎన్నికల షెడ్యూల్ Election Schedule ప్రకటించినప్పటి నుండి సువిధ పోర్టల్‌లో నమోదైన 73,000 దరఖాస్తుల్లో 44,600 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించినట్టు ప్రకటించారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ సూత్రం ప్రాతిపదికన వచ్చిన ఫిర్యాదుల్ని వచ్చినట్టు పరిష్కరిస్తున్నారు.

సువిధ పోర్టల్‌లో నమోదైైన ఫిర్యాదుల్లో 10,819 దరఖాస్తులు చెల్లనివిగా పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేని వాటిని కూడా పక్కన పెట్టారు. ఏప్రిల్ 7 నాటికి అందిన సమాచారం మేరకు మిగిలిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని ఏపీ ఎన్నికల సీఈఓ తెలిపారు.

ఇప్పటి వరకూ ఈసీకి అందిన ఫిర్యాదుల్లో గరిష్టంగా తమిళనాడు నుంచి 23,239 తర్వాత పశ్చిమ బెంగాల్ నుండి 11,976, మధ్యప్రదేశ్ నుండి 10,636 అభ్యర్థనలు అందాయి. చండీగఢ్ (17), లక్షద్వీప్ (18) మరియు మణిపూర్ (20) ల నుంచి కనిష్టంగా దరఖాస్తులు అందాయి.

సువిధ పోర్టల్ ఉచిత, న్యాయమైన మరియు పారదర్శకమైన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుండి అనుమతి అభ్యర్థనలు స్వీకరించేందుకు, వెంటనే వాటిపై తగు చర్యలు తీసుకునేందుకు భారత ఎన్నికల సంఘం చేత అభివృద్ధి చేయబడిన అత్యద్భుత సాంకేతిక పరిష్కారమని సీఈఓ మీనా తెలిపారు.

ఎన్నికల ప్రచార కాలంలో పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే కార్యక్రమాలలో పాల్గొనేందుకు అయా కార్యక్రమాల అనుమతుల కోసం అభ్యర్థనలను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంపై పారదర్శకంగా అందించేందుకు సువిధ పోర్టల్ వీలు కల్పిస్తోంది.

అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించడం, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు తెరవడం, ఇంటింటికి ప్రచారం చేయడం, వీడియో వ్యాన్లు, హెలికాప్టర్లు, వాహన అనుమతులు పొందడం, కరపత్రాలు పంపిణీ చేయడం వంటి అనుమతులను అందిస్తుందని వివరించారు.

ECI IT ఎకోసిస్టమ్‌కు క్లిష్టమైన అప్లికేషన్ సువిధ పోర్టల్ సువిధ పోర్టల్ https://suvidha.eci.gov.in ద్వారా రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా అనుమతి అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో సజావుగా సమర్పించవచ్చన్నారు. అదే సమయంలో ఆఫ్ లైన్ లో అభ్యర్థనలు సమర్పించే అవకాశాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

వివిధ రాష్ట్ర విభాగాల నోడల్ అధికారులతో నిర్వహించే పటిష్టమైన IT ప్లాట్‌ఫారమ్ సహకారంతో దరఖాస్తులను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి సువిధ పోర్టల్ వీలు కల్పిస్తుందని ఈసీ ఏపీ సీఈఒ వివరించారు. సువిధ యాప్‌ ద్వారా కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ అభ్యర్థనల స్థితిని రియల్‌ టైమ్‌లో ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తున్నారు. ఈ యాప్. ఈ యాప్ IoS మరియు Android ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉందని వివరించారు.

ఇంటింటి ప్రచారం విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సీఈఓ తెలిపారు. అప్పటి వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు స్థానిక పోలీసులకు, రిటర్నింగ్‌ అధికారికి ముందస్తు సమాచారం ఇచ్చి పర్యటనలు చేయొచ్చని తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం