Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్‌ రాజీనామా, పవన్‌పై తీవ్ర విమర్శలు.. అంతా నటన అని ఆరోపణలు..-pothina maheshs resignation from jana sena targets pawan kalyan ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్‌ రాజీనామా, పవన్‌పై తీవ్ర విమర్శలు.. అంతా నటన అని ఆరోపణలు..

Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్‌ రాజీనామా, పవన్‌పై తీవ్ర విమర్శలు.. అంతా నటన అని ఆరోపణలు..

Sarath chandra.B HT Telugu
Apr 08, 2024 02:10 PM IST

Pothina Mahesh: విజయవాడలో జనసేన ముఖ్య నాయకుడు పోతిన మహేష్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

జనసేనకు పోతిన మహేష్  రాజీనామా, పవన్‌పై ఆరోపణలు
జనసేనకు పోతిన మహేష్ రాజీనామా, పవన్‌పై ఆరోపణలు

Pothina Mahesh: జనసేనకు Janasena ఆ పార్టీ నాయకుడు పోతిన మహేష్ Pothina mahes రాజీనామా  Resignationచేశారు. 2019 ఎన్నికల్లోజనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా టిక్కెట్‌ వస్తుందని భావించారు. అయితే ఎన్నికల పొత్తుల్లో భాగంగాVijayawada West విజయవాడ పశ్చిమ టిక్కెట్‌ను బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరపున మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంపై మనస్తాపం చెందిన పోతిన మహేష్‌ జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పని చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఏనాడు ద్రుష్టి సారీంచ లేదని, పవన్‌ది అంతా నటనేనని ఆరోపించారు. పవన్ సిద్ధంతాలు అన్ని స్వార్ధ పూరిత ప్రయోజనాల కోసమే ఉంటాయని ఆరోపించారు.

పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఒడించారని మండిపడ్డారు. 25 రోజుల తరువాత జనసేన పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. 21సీట్లతో పార్టీకి ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో బలమైన నగరాల సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్‌ జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తును వెదుక్కున్నారు. గతంలో అధ్యాపకుడిగా పనిచేసినా స్థానికంగా అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న సామాజిక వర్గం కావడంతో ఎన్నికల్లో పోటీ చేయొచ్చని భావించారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారు. పోతిన మహేష్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావుకు 58126 ఓట్లు దక్కాయి. మరో 309 పోస్టల్ ఓట్లు కూడా కలిపి 58435 ఓట్లు దక్కించుకున్నారు.మొత్తం పోలైన ఓట్లలో 38.04 ఓట్లు వెల్లంపల్లికి దక్కాయి. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌కు 50,764 ఓట్లు పడ్డాయి. ఆమెకు 33.04శాతం ఓట్లు దక్కాయి. జనసేన తరపున పోటీ చేసిన పోతిన మహేష్‌కు 22,367ఓట్లు వచ్చాయి. ఆయన 14.56శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

జనసేన Janasena,టీడీపీ TDP మధ్య ఎన్నికల పొత్తు కుదిరిన తర్వాత జనసేనకు కేటాయించే సీట్లలో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఉంటుందని ప్రకటించారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి పోతిన మహేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు.

టీడీపీతో బీజేపీ జట్టు కట్టిన తర్వాత పోతిన మహేష్ టిక్కెట్ ఆశలు గల్లంతయ్యాయి. విజయవాడ తెరపైకి సుజనా చౌదరి వచ్చారు. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని భావించినా ఆ సీటును వదులుకోడానికి టీడీపీ సుముఖత వ్యక్తం చేయలేదు.

దీంతో విజయవాడలో ఏదొక చోట అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. తూర్పులో గద్దె రామ్మోహన్ సీటును కేటాయించే పరిస్థితి లేకపోవడం, సెంట్రల్‌లో బొండా ఉమాను కదిపేందుకు టీడీపీ అంగీకరించక పోవడంతో పశ్చిమకు మొగ్గు చూపారు. సీట్ల ప్రకటనలో తొలి జాబితాలోనే విజయవాడ పశ్చిమ అభ్యర్థిత్వం ఖరారవుతుందని భావించినా అలా జరగలేదు. ఆ తర్వాత పవన్ రెండో జాబితాలో పోతిన పేరు ఉంటుందని సర్ది చెప్పారు. చివరకు ఆ సీటును బీజేపీకి వదిలేశారు.

త్యాగాలు మేమే చేయాలా…?

పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని జనసేన పార్టీ ఇంకో ఇరవై ఏళ్ళు కొనసాగుతుందో లేదో తెలియదని పోతిన మహేష్ అక్రోశం వ్యక్తంచ చేశారు. జనసేన పార్టీ లో పని చేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించ లేదని ప్రశ్నించారు. టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారని, పార్టీ శ్రేణులకు సమాధానము చెప్పాలన్నారు.

తన వద్ద ఆధారాలు ఉన్నాయని, అన్నీ బయట పెడతామన్నారు. కాపు సామజిక వర్గం ను బలి చేస్తున్నారని, కాపు యువతను మోసం చేయవద్దని పవన్‌కు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నామని, వీర మహిళల పదవి కాలం ఎందుకు పొడిగించారని, మిగతా వారి పదవులు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. పవన్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏవిధంగా సీట్ ఇచ్చారన్నారు.

పచ్చ నోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా అని నిలదీశారు. రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీ ని చంపేశారని, టీడీపీ.. జనసేన కి 10 స్థానాలు కుక్క బిస్కెట్స్ పడేసిందా అన్నారు. బీజేపీ టీడీపీని సీట్లు సర్దుబాటు చేయమంటే, జనసేన ఎందుకు సీట్లు ఇవ్వాలన్నారు. జనసేన పార్టీ పొత్తు కుదిరిచ్చితే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలని ప్రశ్నించారు.

కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా అన్నారు. పార్టీ కి విధేయుడిగా ఉన్నందుకు నమ్మక ద్రోహం చేస్తారా అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అడ్రస్ గళ్లంతు అవుతుందన్నారు.

పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం లో పార్టీ సర్వే చేసి, గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. త్యాగాలకు బీసీలు కావాలా, కమ్మ సామాజిక వర్గం పనికి రాదా అన్నారు. పశ్చిమ నియోజకవర్గం సీటును పెత్తం దారులకు కాకుండా వేరే వారికి ఇచ్చి ఉంటే సహకరించే వారిమన్నారు.

 

WhatsApp channel

సంబంధిత కథనం