Jagan Attack Case: దాడి కేసు నిందితుల అచూకీ కోసం కోర్టులో పిటిషన్.. అరెస్ట్ చూపనున్నపోలీసులు
Jagan Attack Case: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుల అచూకీ కోసం విజయవాడ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఈ కేసులో ఇద్దరి అరెస్ట్ చూపేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.
Jagan Attack Case: విజయవాడలో సీఎం ys jagan జగన్‍పై రాయితోAttack దాడి చేసిన కేసులో నిందితుల్ని అరెస్ట్ arrest చూపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఇప్పటికే 48గంటలు దాటిపోవడంతో వారిని కోర్టులో హాజరు పరిచేందుకు రెడీ అవుతున్నారు.
బస్సుకు సమీపంలోని వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి ఫుట్‌పాత్ టైల్‌గా వినియోగించే రాయి ముక్కతో దాడి చేశామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడుAccused Satish సతీష్‌తో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి పోలీసులు స్టేట్‍మెంట్ రికార్డ్ చేశారు. ముఖ్యమంత్రిపై రాయి విసిరిన సతీష్‌ను అరెస్ట్ చేసి మిగిలిన వారి స్టేట్‌మెంట్లు నమోదు చేసి విడిచిపెట్టనున్నారు. రాయితో దాడి చేశాక తమ ఇళ్లకు నిందితులు వెళ్లిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్‌పై దాడి కేసులో ఏ1గా సతీష్, ఏ2గా దుర్గారావును చూపనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దుర్గారావు ప్రోద్భలంతోనే సతీష్ రాయి వేసినట్టు తెలుస్తోంది. నిందితుడు దుర్గారావు అజిత్ సింగ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న దుర్గారావు సతీష్‌ను సిఎంపై దాడి చేయడానికి పురికొల్పినట్టు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రమేయం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు నిందితుడు సతీష్ తో పాటు పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలియ జేయాలంటూ వారి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. నిందితుల వివరాలు తెలుసుకుని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు కోర్టు కమిషనర్‌ను నియమించాలని మెట్రోపాలిటన్ అసిస్టెంట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
గతంలో జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు తరఫున వాదిస్తున్న న్యాయవాది సలీం, జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి చేసిన అనుమానితులు తరఫున కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల అచూకీ కోసం న్యాయవాది కమిషనర్‍ను నియమించాలని పిటిషన్‍లో పేర్కొన్నారు.
బొండా ఉమానే సూత్రధారి….
ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి ఘటనకు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సూత్రధారి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, అతని కుమారుల ఉన్నారని, వారి కనుసన్నల్లోనే దాడి జరిగిందని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.
కేసు దర్యాప్తులో ఉండగానే నిందితులకు డబ్బులు ఇవ్వలేదని కొట్టారని, అన్నా క్యాంటీన్ తీసేశారని దాడి చేశారని ఓ సారి బొండా ఉమా చెప్పారని, ఆయన ప్రమేయం లేకపోతే ఎందుకు కంగారు పడుతున్నారన్నారు. బొండా ఉమా పాత్రపై పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బొండా ఉమా ప్రోద్భలంతోనే సిఎంపై దాడి చేశారని ఆరోపించారు.
సంబంధిత కథనం