AP Pensions: తొలిరోజు 25.66లక్షల మందికి పెన్షన్లు.. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పంపిణీ..-pensions to 25 66 lakh people on the first day continued distribution across the state ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Pensions To 25.66 Lakh People On The First Day.. Continued Distribution Across The State..

AP Pensions: తొలిరోజు 25.66లక్షల మందికి పెన్షన్లు.. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పంపిణీ..

Sarath chandra.B HT Telugu
Apr 04, 2024 08:11 AM IST

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. బుధవారం నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు బ్యాంకుల నుంచి నగదు సచివాలయాలకు చేరడంలో జాప్యం జరగడంతో పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది.

నేటి నుంచి ఏపీలో పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ
నేటి నుంచి ఏపీలో పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌‌లో సామాజిక పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయి విమర్శలకు కారణమైన పెన్షన్ల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టారు. దీంతో సచివాలయాల్లో Secreteriats పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు మినహా మిగిలిన వారంతా సచివాలయాల్లో పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్‌ పంపిణీ ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేపట్టారు. వివిధ రకాల పెన్షన్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు, సోమవారం సెలవుకావడంతో మంగళవారం విడుదల చేసిన నిధులు, బుధవారానికి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. వాటిని నగదుగా విత్‌ డ్రా చేసి పంపిణీ చేపట్టారు.

ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అందరు పెన్షన్‌దారులకు pensioners సాఫీగా పెన్షన్‌ అందేలా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేసినట్టు పంచాయితీ రాజ్‌ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 14,994 గ్రామ/వార్డు సచివాలయాల్లో బుధవారం 13,669 సచివాలయాల్లో పెన్షన్‌ పంపిణీని ప్రారంభించారు. సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల పంపిణీ ప్రారంభం కాలేదు. బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు, వికలాంగులు వంటి నాలుగు విభాగాల పెన్షన్‌దారులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్‌ అందించాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. సచివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఇంటింటి పంపిణీకి కూడా ఏర్పాట్లు చేశారు.

మినహాయింపు ఉన్న పెన్షన్‌దారులు సచివాలయాలకు రానవసరం లేకుండా ఇంటి వద్దే పెన్షన్‌ అందజేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు అధికారులు ప్రకటించారు.

వేసవి ఎండలు Summer దృష్ట్యా గురువారం నుంచి ఉదయం 7.00 గంటల నుండి గ్రామ/వార్డు సచివాలయాల్లో పెన్షన్‌ పంపిణీని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

జగన్ శవరాజకీయాలు చేస్తున్నారన్ చంద్రబాబు…

నెలాఖర్లోనే పెన్షన్ల పంపిణీ సొమ్మును సచివాలయాల ఖాతాలకు బదిలీ చేయాల్సి ఉన్నా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలస్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఫించన్ సొమ్మును కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, ఫించన్లు ఇవ్వటం చేతకాక జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు. నాడు ముద్దులు పెట్టి నేడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనతో ప్రజలు విసుగు పోయారు. మే 13 ఎప్పుడు వస్తుందా.. వైసీపీని బంగాళాఖాతంలో పడేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు వేరయినా అజెండా ఒక్కటేనని రామచంద్రాపురం ఎన్నికల ప్రచారంలో చెప్పారు.

సామాజిక పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అని, నాడు ఎన్టీఆర్ రూ. 35 పించన్ ఇచ్చారని రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచింది తానేనని చెప్పారు. జగన్ విడతల వారీగా రూ. 1000 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడని, వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 1.25 లక్షల సచివాలయ సిబ్బంది ఉన్నారని, ఒక్కొక్కరు 40 మందికి పంపిణీ చేస్తే రెండు రోజుల్లో ఫించన్లు పంపిణీ పూర్తవుతుందని కానీ కేవలం రాజకీయ లబ్దికోసం సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఒకటో తేదీనే ఫించన్ ఇవ్వాలని కానీ నేడు 3 వ తేదీ అయినా ఫింఛన్లు ఇవ్వలేదని ఆరోపించారు.

రూ. 13 వేల కోట్లు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పేదలకు పింఛన్లు ఇవ్వటం చేతకాని దద్దమ్మ జగన్ శవ రాజకీయం చేస్తున్నాడని సచివాలయం సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి రెండు రోజుల్లో ఇవ్వొచ్చని, చేతకాకపోతే దిగిపో ఒక్క రోజులో పంపిణి చేసి చూపిస్తా అన్నారు.

ఫించన్లు ఇస్తామని ఉదయం రమ్మన్నారు, సాయంత్రం వరకు పింఛన్ ఇవ్వలేదని, కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదన్నారు. ఎండదెబ్బకు చనిపోయిన వృద్దులతో శవ రాజకీయం మెదలు పెట్టారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సొంత బాబాయిని చంపి నాపై, సొంత చెల్లిలిపై నింద వేశారని మండిపడ్డారు.

2014 లో తండ్రి లేని బిడ్డను అంటూ తిరిగాడు, 2019 లో బాబాయిని చంపి మా మీద నెట్టారు. ఇప్పుడు వృద్దులను చంపి శవ రాజకీయం చేస్తున్నారు. ఈ పాపం వైసీపీనే వెంటాడుతుంది, వైసీపీ భూస్దాపితం అవ్వక తప్పదు. చనిపోయిన డెడ్ బాడీ తో ఒక మంత్రి నా ఇంటికి వస్తాడంట. ఇలాంటి డ్రామాలు నాదగ్గర కాదు. అలాంటి వారికి తగిన గుణాపాఠం చెబుతానని హెచ్చరించారు.

WhatsApp channel

సంబంధిత కథనం