Janasena Tickets : జనసేన 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా? పవన్ కు హరిరామజోగయ్య లేఖ!-palakollu news in telugu kapu leader harirama jogaiah letter to pawan kalyan on seats sharing ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Palakollu News In Telugu Kapu Leader Harirama Jogaiah Letter To Pawan Kalyan On Seats Sharing

Janasena Tickets : జనసేన 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా? పవన్ కు హరిరామజోగయ్య లేఖ!

Bandaru Satyaprasad HT Telugu
Feb 25, 2024 05:52 PM IST

Janasena Tickets : జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆ పార్టీ మద్దతుదారులు అసంతృప్తికి లోనయ్యారు. కాపు సంఘం నేత హరిరామజోగయ్య... తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పవన్ కు లేఖ రాశారు. జనసేన పరిస్థితి మరీ ఇంత దారుణమా? అని ప్రశ్నించారు.

జనసేన 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?
జనసేన 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?

Janasena Tickets : వచ్చే ఎన్నికల్లో జనసేన (Janasena)24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే జనసైనికులు ఒకింత నిరాశకు గురైయ్యారు. పవర్ షేరింగ్ కోసం ఈ సీట్లు సరిపోవని, మరిన్ని సీట్లు అడగాల్సిందని జనసైనికులు భావిస్తున్నారు. జనసేన మద్దతుదారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు సామాజిక నేత హరిరామజోగయ్య లేఖ(Harirama Jogaiah Letter) రాశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. జనసేన 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకోదన్నారు. జనసేన పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందని ప్రశ్నించారు. జనసైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్‌ అధికారం చేపట్టడమన్నారు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, మంత్రి పదవుల్లో చెరిసగం అని ప్రకటన వస్తేనే ఈ సంక్షోభానికి తెరపడుతుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

జనసేనలో అసంతృప్తి

జనసేనలో టికెట్(Janasena Tickets) ఆశించిన నేతలు... పంపకాలు సీట్లు దక్కకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు. కొందరు నేతల బహిరంగంగా పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ ను టీడీపీకి కేటాయించడంతో జనసేన జగ్గంపేట ఇన్ ఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలోని దుర్గమ్మ ఆలయానికి చేరుకుని పాఠం శెట్టి దంపతులు ఆమరణ దీక్ష చేపట్టారు. తాను ఆమరణ దీక్ష చేపట్టినా...జనసేన- టీడీపీ నాయకత్వాన్ని గెలిపించాలని ఆయన కోరుతున్నారు. పాఠం శెట్టి అభిమానులు ఆయన దీక్షకు మద్దతుగా నిలిచారు.

వైసీపీ సెటైర్లు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly elections) జనసేనకు ఆరు శాతం లోపు ఓట్లతో ఒక్క ఎమ్మెల్యే సీటును గెలిచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పదేళ్లలో పార్టీ నిర్మాణం,సామాజిక బలం ఇలా అన్నింటినీ ఆలోచించి పావు వంతు సీట్లకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే ఓట్లు చీలకూడదనే నిర్ణయంతో పవన్ కల్యాణ్ ఒకడుగు వెనక్కి తగ్గారంటున్నారు విశ్లేషకులు. అయితే సీట్ల పంపకాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ వ్యవహరిస్తుంది. జనసేనకు పావలా వంతు సీట్లు ఇచ్చారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీట్ల పంపకంతో కూటమిలో చీలికలు వస్తాయని వైసీపీ భావిస్తుంది. ఈ మేరకు విమర్శలు డోస్ పెంచింది.

పవన్ సామర్థ్యం అర్థమైంది- మంత్రి బొత్స

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఫైర్ అయ్యారు. టీడీపీ-జనసేన తొలి జాబితాపై బొత్స సెటైర్లు వేశారు. జనసేన 24 సీట్లే కేటాయించడంతో పవన్‌ సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు, పవన్ అమిత్‌షాను కలిసినా, అమితాబ్‌ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. వైసీపీ జాబితాల్లో ఎలాంటి గందరగోళం లేదన్నారు. ఎవ‌రు ఎవరితో కలిసినా వైసీపీ విజ‌యాన్ని ఆప‌లేర‌న్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం