AP Ministers Defeat: ఓటమి బాటలో ఏపీ మంత్రులు, కౌంటింగ్ కేంద్రాల నుంచి నిష్క్రమణ-on the path of defeat ap ministers left the counting centers ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Ministers Defeat: ఓటమి బాటలో ఏపీ మంత్రులు, కౌంటింగ్ కేంద్రాల నుంచి నిష్క్రమణ

AP Ministers Defeat: ఓటమి బాటలో ఏపీ మంత్రులు, కౌంటింగ్ కేంద్రాల నుంచి నిష్క్రమణ

HT Telugu Desk HT Telugu
Jun 04, 2024 10:30 AM IST

AP Ministers Defeat: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అంచనాలకు అందని ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ఉన్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు

AP Ministers Defeat: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజ‌క‌ వ‌ర్గాల కౌంటింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా చూస్తే టీడీపీ కూట‌మి ఆధిక్యంలో కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని మంత్రులు రోజా, బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి, చెన్నుబోయిన వేణుగోపాల్‌, అనిల్ కుమార్ యాద‌వ్ వెన‌కంజ‌లో ఉన్నారు.

పుంగ‌నూరులో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, చీపుర‌ుప‌ల్లిలో బొత్స స‌త్యన్నారాయ‌ణ‌, మంత్రి రోజా న‌గిరిలోనూ వెన‌కంజ‌లో ఉండ‌గా, డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, రాజమండ్రి రూర‌ల్‌లో మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్, క‌డ‌ప‌లో మంత్రి అంజాద్ బాషా, తునిలో దాడిశెట్టి రాజా, గాజువాకలో పోటీ చేస్తున్న మంత్రి గుడివాడ అమర్ నాద్, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, మంత్రి జోగి రమేష్, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట్‌లో మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ వెన‌కంజ‌లో ఉన్నారు. వీరితో పాటు కీల‌క నేత‌లు కొడాలి నాని లాంటి వారు కూడా వెన‌కంజ‌లో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టిస్తున్నారు. భారీ ఆధిక్యం దిశగా కూటమి అభ్యర్థులు దూసుకు వెళుతున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది. ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలను గెలుపొందారు. రాయలసీమలో కూడా కూటమి అభ్యర్థులు జోరు మీద ఉన్నారు. ఉమ్మడి గోదావరిలోనూ కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ఉన్నారు. దక్షిణ కోస్తాలో సైకిల్ గుర్తు జోరు మీద ఉంది. ఒకరిద్దరు మినహా మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా కూటమి అభ్యరస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తుండటంతో పలువురు ముఖ్య నాయకులు కౌంటింగ్ కేంద్రాల నుంచి నిష్క్రమిస్తున్నారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు. దీంతో కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel