Pawan Kalyan : అధికారం ఇచ్చింది కక్ష సాధించడానికి కాదు, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం - పవన్ కల్యాణ్
Pawan Kalyan : కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం ఇవాళ్టి ఫలితాలు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇది కక్ష సాధింపు సమయం కాదన్నారు. వైఎస్ జగన్, వైసీపీ నేతలు తనకు శత్రువులు కాదన్నారు.
Pawan Kalyan : భారతదేశంలో 100కు 100 శాతం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేన అని జనసేన విజయోత్సవ వేడుకలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి సతీ సమేతంగా చేరుకున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్. వీరితో పాటుగా పవన్ కుమారుడు అకీరా నందన్, సాయిధరమ్ తేజ్ ఉన్నారు. జనసేన విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం ఇవాళ వచ్చిన విజయం అన్నారు. ఇది కక్ష సాధింపు చేసే సమయం కాదని, ఏపీ ప్రజల కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేసే సమయం, భవిష్యత్తు తరాల కోసం పనిచేసే సమయం అన్నారు.
అధికారం ఉందని ఇబ్బంది పెట్టను
"నాకు వైఎస్ జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ వ్యక్తిగత శత్రువులు కాదు. అధికారం ఉంది కదా అని ఇబ్బంది పెట్టను, ఇది వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు వచ్చిన గెలుపు కాదు, 5 కోట్ల ప్రజల కోసం పనిచేసేందుకు వచ్చిన గెలుపు. ఇది కక్ష సాధింపు చేసే సమయం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పనిచేసేందుకు ఇచ్చిన గెలుపు. చాలా చారిత్రాత్మకమైన రోజు ఈరోజు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు, జవాబుదారీ ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది" - పవన్ కల్యాణ్
సంబంధిత కథనం