Students Suspended : సీఎం జగన్ ముందు పవన్ కు జై కొట్టిన విద్యార్థులు, సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం!
Students Suspended : సీఎం జగన్ ముందు పవన్ కల్యాణ్, చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు కొందరు విద్యార్థులు. ఈ ఘటన శుక్రవారం జగ్గంపేట నియోజకవర్గంలో చోటుచేసుకుంది. దీంతో ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Students Suspended : వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan)కు వింత అనుభవం ఎదురైంది. సీఎం జగన్ ముందే..విద్యార్థులు పవన్, చంద్రబాబుకు జై కొట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర చేస్తున్నారు. శుక్రవారం సీఎం జగన్ బస్సు యాత్ర జగ్గంపేట(Jaggampeta) నియోజకవర్గంలోకి కొనసాగింది. ఈ సమయంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. సీం జగన్ బస్సు యాత్ర ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే కొందరు విద్యార్థులు చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. సీఎం జగన్ ముందే విద్యార్థులు బాబులకే బాబు కల్యాణ్ బాబు అంటూ పెద్దగా నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలు చేసిన విద్యార్థులపై ఆదిత్య కాలేజీ(Aditya College) యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

అసలేం జరిగింది?
సీఎం జగన్ బస్సు యాత్ర(CM Jagan Bus Yatra) జగ్గంపేట నియోజకవర్గంలోని ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే ఆ కాలేజీ యాజమాన్యం ఇంజినీరింగ్ విద్యార్థులను(Engineering Students) రోడ్డుపై నిలబెట్టింది. జగన్ వచ్చినప్పుడు అభివాదం చేయాలని విద్యార్థులను చెప్పి రోడ్డుపై వారిని నిలబెట్టారు. అయితే కాలేజీ వద్ద జగన్ బస్సు నుంచి దిగుతుండగా అక్కడున్న కొందరు విద్యార్థులు 'జై పవన్' (Pawan))అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో సీఎం జగన్ ఓ మహిళతో మాట్లాడి బస్సులోకి వెళ్లిపోయారు. అయితే సీఎం జగన్ ముందు విద్యార్థులు పవన్ కు జైకొట్టడంపై ఆదిత్య కాలేజీ యాజమాన్యం సీరియస్ అయ్యింది. పవన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను యాజమాన్యం కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం. సీఎం జగన్ కాన్వాయ్(CM Jagan Convoy) ఎదుట సరిగ్గా ప్రవర్తించని కారణంగా విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం లేఖలో పేర్కొంది. అన్యాయంగా విద్యార్థులను సస్పెండ్ చేశారని ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ పై జనసేన ఈసీకి ఫిర్యాదు
ఈ నెల 16న భీమవరంలో వైసీపీ నిర్వహించిన సభలో సీఎం జగన్(CM Jagan) పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ పవన్ కల్యాణ్ (Pawan Marriages)పెళ్లిళ్లలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి సీఎం జగన్ పదే పదే మాట్లాడుతున్నారని ఆరోపించింది. మహిళల్ని కించపరిచేలా సీఎం జగన్ మాట్లాడారని తన ఫిర్యాదులో తెలిపింది. సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని జనసేన పార్టీ నేతలు సీఈవో ముకేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
సంబంధిత కథనం