Jagan On CBN: చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తల పెట్టినట్టే… ప్రకాశం జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం-jagans election campaign in prakasam sa if you vote for cbn its like putting head in a tigers mouth ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Jagan On Cbn: చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తల పెట్టినట్టే… ప్రకాశం జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం

Jagan On CBN: చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తల పెట్టినట్టే… ప్రకాశం జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం

Sarath chandra.B HT Telugu
Apr 08, 2024 12:47 PM IST

Jagan On CBN: చంద్రబాబుకు ఓటు వేస్తే అది పులినోట్లో తలపెట్టినట్టేనని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో నిర్వహించిన ప్రచారంలో జగన్ పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో సిఎం జగన్
ఎన్నికల ప్రచారంలో సిఎం జగన్

Jagan On CBN: చంద్రబాబు Chandrababuమాదిరి అబద్దాలు చెప్పనని, అబద్దాలు చెప్పడం రాదని, మోసాలు చేయడం తనకు రాదని ఏపీ సిఎం జగన్ చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 66.34లక్షల మంది పెన్షన్ Pension అందుకుంటున్నారని దేశంలో జనాభా ప్రకారం అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ Andhrapradesh మాత్రమేనని జగన్ చెప్పారు.

దేశంలో మూడు వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు రూ.400కోట్లు ఖర్చు అయితే, వైసీపీ వచ్చాక నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని జగన్ వివరించారు. .

ఒక్క పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.24వేల కోట్లను ఇస్తున్నట్లు చెప్పారు. 58నెలల్లో రూ.90వేల కోట్లను అవ్వాతాతలకు చెల్లించినట్టు చెప్పారు. ఏపీలో ఏటా రూ.24వేల కోట్లు ఇస్తుంటే, బీహార్‌లో పెన్షన్ల కోసం రూ.4300కోట్లు, యూపీలో రూ.5160కోట్లు, కర్నాటకలో 4170 కోట్లు, తెలంగాణలో రూ.8180 కోట్లు చెల్లిస్తున్నారని ఏపీలో మాత్రమే రూ.24వేల కోట్లు ఏటా ఖర్చు చేస్తున్నారని చెప్పారు.

మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరిన సీఎం జగన్, వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమం - తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం వద్ద రాత్రి బస చేయనున్నారు.

అబద్దాలు చెప్పను…

ప్రజల్ని మోసం చేయడానికి రూ.4వేలు, 5వేలు, ఆరువేలు, ఎనిమిది వేలు పెన్షన్లు ఇస్తామని అబద్దాలు చెబుతారని, తాను చేయగలిగింది మాత్రమే చెబుతానని, 58నెలల్లో మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశానని జగన్ చెప్పారు.

పేదలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీ పడే నాయకుడు దేశంలో ఎక్కడా లేరన్నారు. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మంచి చేసే విషయంలో వెనక్కి తగ్గనని ప్రకాశం వెంకటా చలంపల్లిలో చెప్పారు. 2014లో ఏమి జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు.

చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్టేనని జగన్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడిందో చూశారని, వాలంటీర్లను పునరుద్దించాలనే విజ్ఞప్తులపై సిఎం స్పందించారు.

14ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబుకు వాలంటీర్లను తీసుకొచ్చి, లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు వసూలు చేసి, వారి పార్టీ వారికే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చూశారని ఆరోపించారు. చంద్రబాబు అధ:పాతాళానికి జారిపోయారన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసే ఫైల్‌పై మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. వాలంటీర్లతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం