YS Jagan With IPac: ఐపాక్ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..
Ys Jagan With IPac: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఐప్యాక్ కార్యాలయంలో ఉద్యోగులతో మాట్లాడిన జగన్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
Ys Jagan With IPac: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ బృందంతో భేటీ అయ్యారు. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలో ఉన్న ఐపాక్ కార్యాలయానికి అనధికారిక పర్యటనలో భాగంగా వెళ్లిన సిఎం జగన్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఐ పాక్ ఉద్యోగులను పేరుపేరున పలకరించారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి జగన్ స్పందించారు. ఐప్యాక్ కార్యాలయంలో ఉద్యోగులతో మాట్లాడిన సిఎం జగన్ గెలుపుపై ధీమా ప్రకటించారు. శుక్రవారం సిఎం జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో గురువారం ఐప్యాక్ కార్యాలయానికి వచ్చారు.
ఎన్నికల సరళిపై పూర్తి అవగాహనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. ఈ ఎన్నికల ఫలితాల్లో తాము ఖచ్చితంగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. జూన్4న వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్య పోతుందన్నారు.
రానున్న ఎన్నికల ఫలితాల్లో తాము 22ఎంపీ సీట్లను గెలుస్తున్నామని జగన్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లను తాము గెలుస్తున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో కూడా ప్రజలకు మరింత మేలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు.
ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా మరోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఐపాక్ ఉద్యోగులు సిఎం సిఎం నినాదాలతో హోరెత్తించారు. ప్రజలకు ఐదేళ్ల పాటు గొప్ప పాలన అందించామని, అంతకు మించిన పాలన అందిస్తామన్నారు. ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనివని సిఎం జగన్ చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఐప్యాక్ టీమ్ సభ్యులతో మాట్లాడిన జగన్ ప్రతి ఒక్కరిని పేరుపేరున వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం నుంచి విదే